జార్ఖండ్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మెజార్టీ లేకపోయినా ఎన్డీఏ అభ్యర్థి పరిమల్ నత్వానీ విజయం సాధించారు. కాంగ్రెస్ గెలవాల్సిన సీటును బీజేపీ తన్నుకుపోయింది. క్రాస్ ఓటింగ్ కారణంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపొందారు. ఇక మరొక స్థానాన్ని జేఎంఎం అభ్యర్థి బైద్యనాథ్ రామ్ కైవసం చేసుకుంది. విజయం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
జార్ఖండ్ నుంచి ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాల కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. జేఎంఎం అభ్యర్థి బైద్యనాథ్ రామ్‌తో పాటు ఎన్డీఏ మద్దతు పొందిన స్వతంత్ర అభ్యర్థి పరిమల్ నత్వానీ విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా పరాజయం పాలయ్యారు. అసెంబ్లీలో సంఖ్యాబలం పరంగా ఇండియా కూటమికి ఆధిక్యం ఉన్నప్పటికీ.. క్రాస్ ఓటింగ్ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామం కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించిన బైద్యనాథ్ రామ్‌కు సీఎం హేమంత్ సోరెన్ అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆశయాల సాధన కోసం పార్లమెంట్‌లో సమర్థవంతంగా పనిచేయాలని సూచించినట్లు సమాచారం. ఇక ఎన్డీఏ మద్దతుతో గెలిచిన పరిమల్ నత్వానీ కూడా జార్ఖండ్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
Ranchi: Baidyanath Ram of JMM meets Jharkhand CM Hemant Soren following his victory in the Rajya Sabha elections
For 2 Rajya Sabha seats, there candidates were in fray. Baidyanath Ram of JMM and NDA-backed Rajya Sabha candidate Parimal Nathwani secured victory.
Congress… pic.twitter.com/NSw2q4tYjK
— ANI (@ANI) June 18, 2026




