22
April, 2026

A News 365Times Venture

22
Wednesday
April, 2026

A News 365Times Venture

JD Chakravarthy: అందుకే హీరోలు తమ కూతుళ్లను సినిమాల్లోకి రానివ్వరు – జె.డి. చక్రవర్తి

Date:

టాలీవుడ్ వెర్సటైల్ నటుడు జేడీ చక్రవర్తి ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఎదురయ్యే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఆయన కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా స్టార్ హీరోలు తమ కూతుళ్లను సినిమాల్లోకి పంపడానికి ఎందుకు భయపడతారో ఆయన వివరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

Also Read : Ranbir Kapoor: రణ్‌బీర్ కపూర్ డైలమా.. సందీప్ రెడ్డికి ‘హ్యాండ్’ ఇస్తాడా?

సినిమా ఇండస్ట్రీలో జరిగే అన్యాయాల గురించి జె.డి. చక్రవర్తి మాట్లాడుతూ.. ‘పరిశ్రమలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. కానీ అవి బయట ప్రపంచానికి తెలియవు. తెలిసిన వారు సైతం నోరు విప్పడానికి సాహసించరు. అందుకే అగ్ర హీరోలు సైతం తమ కూతుళ్లు సినిమాల్లోకి వస్తానంటే అంతగా ఇష్టపడర’ అని ఆయన అని కుండబద్దలు కొట్టారు. అలాగే ఇదే అంశంపై సీనియర్ నటి రాధికా గారు కూడా గతంలో స్పందించారు. తన భర్త శరత్ కుమార్ గారు తమ కుమార్తెను సినిమాల్లోకి పంపడానికి అంగీకరించలేదని ఆమె పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉండే పరిస్థితులు, ఆడపిల్లల పట్ల ఉండే ధోరణి వల్లే తల్లిదండ్రులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని జె.డి. చక్రవర్తి మాటల సారాంశం.

ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు మన ఇండస్ట్రీలో తగిన గుర్తింపు లభించడం లేదని, ఇతర భాషల నటీమణులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వస్తున్న విమర్శల నేపథ్యంలో జె.డి. చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇండస్ట్రీలో పాతుకుపోయిన కొన్ని అలిఖిత నిబంధనలు, రాజకీయాలు ప్రతిభ ఉన్న వారికి కూడా అడ్డంకిగా మారుతున్నాయని ఈ వీడియో ద్వారా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Iran: అసిమ్ మునీర్.. ట్రంప్ భజనపరుడు.. ఓ రేంజ్‌లో ఆడుకున్న ఇరాన్ మీడియా

ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇప్పటికే ఇస్లామాబాద్...

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమైంది. గత రెండ్రోజులు మార్కెట్...

Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?

డీలిమిటేషన్ రాజ్యాంగ బాధ్యత అయితే.. మహిళా రిజర్వేషన్ల అమలు సామాజిక బాధ్యత....

YS Jagan: “మీరు భయపడుతున్నారు”.. సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..

YS Jagan: సీఎం చంద్రబాబు ఇటీవ‌ల మీరు వ్యవ‌హ‌రిస్తున్న తీరు చూస్తుంటే...