30
October, 2026

A News 365Times Venture

30
Friday
October, 2026

A News 365Times Venture

Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..

Date:

Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో అరబ్ ఓటర్లను ప్రభావితం చేయడానికి డబ్బులు ఖర్చు చేసిందన్న ఆరోపణల్ని ఖతార్ తీవ్రంగా ఖండించింది. తమ దేశాన్ని ఇజ్రాయిల్ రాజకీయ నాయకుల వైఫల్యాలకు బలిపశువును చేయొద్దని దోహా స్పష్టం చేసింది. ఎన్నికల్లో విదేశీ జోక్యం జరిగిందన్న అనుమానాలపై ఇజ్రాయిల్ అంతర్గత భద్రత సంస్థ షిన్ బెట్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఖతార్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.

ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాజెద్ అల్ అన్సారీ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి తమ దేశం ఎలాంటి జోక్యం చేసుకోలేదని, ఇందుకోసం నిధులు సమకూర్చలేదని స్పష్టం చేశారు. కొంత మంది ఇజ్రాయిల్ నాయకులు, వారికి అనుకూలంగా ఉన్న మీడియా వర్గాలు ఖతార్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, తప్పుడు సమాచారా ప్రచారానికి పాల్పడుతున్నాయని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇజ్రాయిల్ రాజకీయ వివాదాల్లోకి ఖతార్‌ను లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.

దీనికి ముందు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూడా వామపక్ష రాజకీయ వర్గాలను ప్రభావితం చేసిందని ఖతార్‌పై ఆరోపనలు చేశారని, ఇప్పుడు అరబ్ ఓటర్ల విషయంలోనూ ఇదే తరహా ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. నెతన్యాహు ప్రధాన ప్రత్యర్థి గాడి ఐసెన్‌కాట్ కూడా ఎన్నికల్లో విదేశీ జోక్యం జరిగిందన్న అనుమానాలపై తనకు సమాచారం అందుతోందని తెలిపారు. ఇజ్రాయెల్ ఎన్నికల్లో విదేశీ జోక్యం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని, ముఖ్యంగా హమాస్‌కు నిధులు అందిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశం ప్రమేయం ఉంటే అది ఆందోళనకరమని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఖతార్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, హమాస్‌తో ఈ దేశానికి సంబంధాలు ఉన్నాయనేది బహిరంగం రహస్యం.

నెతన్యాహూ కూటమికి ఆధిక్యం..

ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూటమి 53-54 స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. గాడి ఐసెన్‌కాట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి సుమారు 48 స్థానాలు వస్తాయని అంచనా. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాల మెజారిటీని ఏ కూటమి సాధించలేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. సుమారు 90 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి అరబ్ పార్టీలు కలిపి 19 స్థానాలు గెలుచుకున్నట్లు నివేదికలు తెలిపాయి. ఇజ్రాయిల్ మొత్తం ఓటింగ్ శాతం 77.7గా ఉండగా, అరబ్ కమ్యూనిటీలో సుమారు 60 శాతం ఓటింగ్ నమోదైంది.

ఖతార్, టర్కీలపై ఆరోపణలు..

అరబ్ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఖతార్, టర్కీ వంటి విదేశీ శక్తులు నిధులు సమకూర్చాయా? అనే కోణంలో షిన్ బెట్ విచారణ చేస్తున్నట్లు ‘ది జెరూసలెం పోస్ట్’ నివేదించింది. ఇజ్రాయెల్ సెంట్రల్ ఎలక్షన్స్ కమిటీ చైర్మన్ జస్టిస్ నోమ్ సోల్‌బర్గ్ ఆదేశాల నేపథ్యంలో ఈ విచారణ ప్రారంభమైనట్లు పేర్కొంది.

ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ ఎన్నికల్లో పోటీ చేసిన అరబ్ పార్టీల కూటమి జాయింట్ లిస్ట్.. నెతన్యాహూ ఎన్నికల్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తోంది. ఇది ఎన్నికల ఫలితాలను బలహీనపరిచే ప్రయత్నమని ప్రకటించింది. నవంబర్ 4న తుది ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

YS Jagan: స్థానిక ఎన్నికల్లో అక్రమాలు.. శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి..

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ...

OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?

OTR: పంచేసుకున్నారా….? వాళ్ళిద్దరూ షేర్‌ చేసుకున్నారా? బావా బావమరుదులు ఇద్దరూ…. నీకది,...

World Record Century: 38 బంతుల్లో శతకం.. రికార్డు స్పష్టించిన తనీషా..

ఢిల్లీ మహిళల దేశీయ టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర ఆవిష్కారమైంది. సీనియర్...

Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!

Ilhan Omar: అమెరికా డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎంపీ ఇల్హాన్ ఒమర్...