6
May, 2026

A News 365Times Venture

6
Wednesday
May, 2026

A News 365Times Venture

Iran-US: ఇరాన్‌కు ఏదైనా జరిగితే.. ఆ తర్వాత సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ట్రంప్‌కు ఖమేనీ వార్నింగ్

Date:

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇరాన్‌లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగిన నిరసనల్లో దాదాపు 30 వేల మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిరసనకారులకు ఏదైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ సమీపంలో మోహరిస్తున్నాయి. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌక టెహ్రాన్ సమీపంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఏదో క్షణంలో ఇరాన్‌పై అమెరికా దాడి చేయొచ్చని ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి: PM Modi: వరల్డ్‌లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడమే లక్ష్యం.. నిర్మలమ్మ బడ్జెట్‌పై మోడీ వ్యాఖ్య

ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాపై చేసే ఏ దాడైనా మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ యుద్ధానికి దారి తీస్తుందని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా నావికాదళ మోహరింపు, ఈయూ మిలిటరీలను ఉగ్రవాద గ్రూపులుగా పేర్కొన్న తర్వాత ఉద్రిక్తలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఖమేనీ ఈ ప్రకటన చేశారు. ‘‘మేము ప్రేరేపకులం కాదు. మేము ఏ దేశంపైనా దాడి చేయాలని కోరుకోవడం లేదు. కానీ ఇరాన్ దేశంపై దాడి చేసినా లేదా వేధించినా వారికి గట్టి దెబ్బ తగులుతుంది.’’ అని ఖమేనీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: TTD EO: టీటీడీ ఈవో గా ముద్దాడ రవిచంద్ర.. అనీల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటు

అయితే ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తుందా? లేదా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. ఇక అమెరికాతో యుద్ధం కోరుకోవడం లేదని ఇరాన్ అంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా నిర్ణయం ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా ఉంది. ఇదిలా ఉంటే ఆది, సోమవారాల్లో ఇరాన్ వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిలో లైవ్-ఫైర్ మిలిటరీ డ్రిల్‌ను ప్లాన్ చేసింది. ఇది పర్షియన్ గల్ఫ్ ఇరుకైన ముఖద్వారం. దీని ద్వారా మొత్తం చమురు వ్యాపారంలో ఐదవ వంతు వెళుతుంది. ఈ డ్రిల్ సమయంలో అమెరికన్ యుద్ధనౌకలు లేదా విమానాలను బెదిరించవద్దని లేదా వాణిజ్య ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ హెచ్చరించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరగబోతున్నాయా? మళ్లీ రెండు దేశాలు చర్చలు...

Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన

సోమవారం వెలువడిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన...

AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా ప్రభుత్వం భారీ అడుగు...