30
April, 2026

A News 365Times Venture

30
Thursday
April, 2026

A News 365Times Venture

Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్

Date:

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమయ్యేటట్టు కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్-అమెరికా మధ్య పంచాయితీ తెగడం లేదు. దీంతో రెండు దేశాలు హెచ్చరికలు చేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాకు ఇరాన్ తీవ్ర వార్నింగ్ ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలపై కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించింది. ఆ ఆయుధం పేరెత్తగానే శత్రు బలగాలు తీవ్రంగా భయపడుతున్నాయని.. గుండెపోటు కూడా తెప్పించగలదన్నారు.

హార్ముజ్ జలసంధిపై దిగ్బంధం ఎత్తేస్తే చర్చలు జరుపుతామని ఇరాన్ వెల్లడించింది. ఈ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు. ముందు అణు ఒప్పందం చేసుకుంటేనే దిగ్బంధం ఎత్తేస్తానని.. లేదంటే నిరవధికంగా దిగ్బంధం కొనసాగుతుందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి.

ఇరాన్ నౌకాదళాధికారి రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ మాట్లాడుతూ.. శత్రువులు భయపడే కొత్త ఆయుధాన్ని త్వరలోనే ఉపయోగిస్తామని తెలిపారు. ‘‘ఆ ఆయుధం వాళ్ల దగ్గరే ఉంది.. చూస్తే హార్ట్ అటాక్ వచ్చేలా ఉంటుంది.’’ అని వ్యాఖ్యానించారు.

అమెరికా నౌకపై క్షిపణి దాడులు?
అమెరికా విమాన వాహక నౌక యూఎస్ అబ్రహం లింకన్ నౌకపై కనీసం ఏడు క్షిపణి దాడులు జరిపినట్లు తెలిపారు. దీంతో కొంతకాలం అమెరికా వైమానిక కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయని పేర్కొన్నారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా మధ్యప్రాచ్యంలో 100కి పైగా దాడులు నిర్వహించినట్లు ఇరాన్ పేర్కొంది. అలాగే శత్రు దేశాల నౌకలకు హార్ముజ్ మార్గాన్ని మూసివేసినట్లు వెల్లడించింది. ఇక అమెరికా చర్యలను “పైరసీ”గా పేర్కొంటూ ఇరాన్ తీవ్ర విమర్శలు చేసింది. “సోమాలియా దొంగల కంటే అమెరికా చెడ్డది” అంటూ వ్యాఖ్యానించింది. ఇరాన్ నౌకలను అక్రమంగా స్వాధీనం చేసుకుని.. సిబ్బందిని బంధించారని ఆరోపించింది.

తాజాగా ట్రంప్ మాట్లాడుతూ హార్ముజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు ఒప్పందం చేసుకునేంత వరకు హార్ముజ్ జలసంధిపై విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయబోమని తేల్చి చెప్పారు. ముందు దిగ్బంధం ఎత్తేస్తేనే అణు ఒప్పందంపై చర్చిస్తామన్న ఇరాన్ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు. ఇరాన్ ముందు తగిన విధంగా అణు ఒప్పందం చేసుకుంటనే దిగ్బంధాన్ని ఎత్తివేస్తామని.. లేదంటే దిగ్బంధం కొనసాగుతుందని ట్రంప్ పేర్కొన్నారు.

ఈ పరిణామాలు చూస్తుంటే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా, భద్రతా పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య...

Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్...

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)...

Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్‌తో ఉత్కంఠ..

Bengal exit polls: 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీలకు...