10
June, 2026

A News 365Times Venture

10
Wednesday
June, 2026

A News 365Times Venture

IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?

Date:

2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటివరకు 15 విభిన్న ఫ్రాంచైజీలు ఆడాయి. 2022లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జాయింట్స్ రాకతో జట్ల సంఖ్య 10కి చేరింది. అయితే.. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఒకటైన బీహార్‌కు ఇప్పటివరకు ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో.. వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా బీహార్‌కు ప్రత్యేక ఐపీఎల్ జట్టు ఉండాలని గట్టిగా ఆకాంక్షించారు.

బీహార్ మట్టిలో అద్భుతమైన క్రికెట్ ప్రతిభ దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. అత్యంత వేగంగా వన్డే డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ (పాట్నా), రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ అత్యంత పిన్న వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి సెంచరీలతో రికార్డులు సృష్టించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (సమస్తీపూర్), అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్న సాకిబ్ హుస్సేన్ (గోపాల్‌గంజ్) వంటి ఆటగాళ్లను బీహార్ దేశానికి అందించిందని గుర్తుచేశారు. ఇంతటి ప్రతిభ ఉన్నప్పటికీ, బీహార్‌కు సొంత క్రికెట్ గుర్తింపు లేకపోవడం తనను ఎప్పుడూ కలచివేస్తుందని అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరహాలోనే బీహార్‌కు కూడా ఒక అజేయమైన జట్టు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. బీహార్ యువతకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, మద్దతు లభిస్తే, అక్కడి నుండి వచ్చే జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీనికోసం తాను పూర్తి స్థాయిలో, నిరభ్యంతరంగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

విధ్వంసకర జట్టుగా మారుతుందా? నెటిజన్ల అభిప్రాయం..
అనిల్ అగర్వాల్ పోస్ట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. ఒకవేళ బీహార్‌కు కొత్త ఐపీఎల్ జట్టు వస్తే.. స్థానిక స్టార్లయిన ఇషాన్ కిషన్, రికార్డుల వీరుడు వైభవ్ సూర్యవంశీలను ఆ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తే గనుక, అది ఐపీఎల్‌లోనే అత్యంత విధ్వంసకరమైన జట్టుగా మారుతుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఈ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల కాంబినేషన్ ఓపెనింగ్‌లో వస్తే CSK, MI, RCB వంటి దిగ్గజ జట్ల బౌలింగ్ లైనప్‌లు కూడా తట్టుకోలేవని విశ్లేషిస్తున్నారు.

సాధ్య సాధ్యాలు..
అనిల్ అగర్వాల్ వంటి బిలియనీర్ ‘అన్‌కండిషనల్ సపోర్ట్’ ఇస్తానని ప్రకటించడం వల్ల ఫ్రాంచైజీ కొనుగోలుకు , భారీ పెట్టుబడులకు ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. బీహార్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అపారం. కొత్త జట్టు వస్తే వ్యూయర్‌షిప్, స్పాన్సర్‌షిప్ పరంగా బీహార్ ఐపీఎల్ జట్టుకు భారీ మార్కెట్ లభిస్తుంది. ఇషాన్, వైభవ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఇప్పటికే నిరూపించుకున్నారు కాబట్టి, జట్టుకు లోకల్ ఐడెంటిటీ మరియు బ్రాండ్ వాల్యూ త్వరగా వస్తుంది.

ఒకవేళ కొత్త జట్టు వచ్చినా, ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీలను నేరుగా జట్టులోకి తీసుకోలేరు. వారు ప్రస్తుతం ఆడుతున్న ఫ్రాంచైజీలు వదిలేస్తేనే, వేలంలో భారీ ధర చెల్లించి దక్కించుకోవాల్సి ఉంటుంది. ఐపీఎల్ స్థాయి మ్యాచ్‌లను నిర్వహించడానికి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన స్టేడియాలు, వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బీహార్‌లో ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాల్సి ఉంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో 10 జట్లు ఉన్నాయి. లీగ్ విండో పరిమితుల వల్ల త్వరలోనే మరో కొత్త జట్టును చేర్చుకునే ఆలోచనలు ప్రస్తుతానికి లేవని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ గతంలో సూచనప్రాయంగా తెలిపారు. 2028 నాటికి మ్యాచ్‌ల సంఖ్యను 74 నుండి 94కి పెంచే అవకాశం ఉన్నప్పటికీ, అది 10 జట్ల మధ్యే ‘హోమ్ అండ్ అవే’ ఫార్మాట్‌లో జరిగే అవకాశం ఉంది. కొత్త జట్ల చేరికపై బీసీసీఐ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, అనిల్ అగర్వాల్ చేసిన ప్రతిపాదన బీహార్ క్రికెట్ అభిమానుల్లో ఒక కొత్త చర్చకు, ఆశకు తెరలేపింది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..

Vizag: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య...

Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!

Ceiling Fan: వేసవికాలంలో ఇంట్లో చల్లదనాన్ని అందించే ప్రధానమైన వాటిలో సీలింగ్...

Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో నేడు రాజకీయంగా రెండు కీలక సమావేశాలు...

ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్‌బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..

ISIS: ఉగ్రవాద సంస్థ ఐసిస్ దురాగతాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మహిళల్ని...