10
October, 2026

A News 365Times Venture

10
Saturday
October, 2026

A News 365Times Venture

INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..

Date:

INDIA bloc:  ఇండియా కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును శుక్రవారం కలిశారు. ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ఆరోపణలు చేస్తూ .. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఇండియా కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతి పత్రం సమర్పించారు. శుక్రవారం రాత్రి 10 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిశారు.

రాష్ట్రపతిని కలిసిన బృందంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ, సీపీఐ నేత డి. రాజా, సమాజ్‌వాదీ పార్టీ నేత రాజీవ్ రాయ్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత సుప్రియా సూలే, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, వీసీకే నేత తొల్ తిరుమావళవన్ ఉన్నారు.

ఇదిలా ఉంటే, ఇండియా కూటమి ఎంపీలు సేవ్ డెమోక్రసీ బ్యానర్ పట్టుకుని పార్లమెంట్ నుంచి బయలుదేరారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని విజయ్ చౌక్ వద్ద అడ్డుకున్నారు. దీంతో వీరు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ.. తమ లక్ష్యం నెరవేరే దాకా ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. విపక్షాలు ప్రధానంగా 3 డిమాండ్లు చేస్తున్నాయి. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయడం, ఓటర్ల జాబితాలో తొలగించిన 13.3 కోట్ల మంది పేర్లను చేర్చడం, ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..

రాంచీలోని జెఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల...

Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..

Rahul Gandhi: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ద్వారా...

Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్‌లో హెచ్‌పి, డెల్, ఆసుస్,...

Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు

నోబెల్ శాంతి బహుమతి విజేత నవీ పిళ్లైపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్...