8
June, 2026

A News 365Times Venture

8
Monday
June, 2026

A News 365Times Venture

INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..

Date:

INDIA alliance: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇండియా కూటమి భేటీకి సిద్ధమైంది. రేపు ( జూన్ 08)న ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరగనుంది. గత రెండు సమావేశాలు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నివాసాల్లో జరినప్పటికీ, రేపటి సమావేశానికి తటస్థ వేదికను ఎంచుకున్నారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ, తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే ఓడిపోయిన తర్వాత ఈ భేటీ జరుగుతుండటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.

టీఎంసీ సంక్షోభం నేపథ్యంలో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు ఈ సమావేశానికి హాజరుకాబోతునున్నారు. మరోవైపు, తమిళనాడులో విజయ్‌ ప్రభుత్వంలో కాంగ్రెస్ చేరడంతో, కాంగ్రెస్-డీఎంకే మధ్య విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. దీంతో ఈ సమావేశానికి తాము రావడం లేదని డీఎంకే ఇప్పటికే ప్రకటించింది. ఈ సమావేశానికి 23 పార్టీలు హాజరవుతాయని కాంగ్రెస్ తెలిపింది. కాంగ్రెస్ తీరుపై అసంతృప్తితో ఉన్నప్పటికీ సీపీఎం మాత్రం ఈ సమావేశానికి హాజరుకానుంది. పినరయి విజయన్, బీజేపీలు కుమ్మక్కు అయ్యాయంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ రెండు రోజుల క్రితం ఖర్గేకు లేఖ రాశారు.

ఈ సమావేశాని ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ కూడా సమావేశానికి వస్తున్నట్లు చెప్పింది. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇతర చిన్నాచితక పార్టీలు సమావేశానికి వస్తున్నట్లు చెప్పాయి. ఓటమి తర్వాత, కాంగ్రెస్ స్నేహాన్ని మమతా బెనర్జీ పార్టీ కోరుకుంటోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీలికగా మారడంతో ఆమె కాంగ్రెస్ సాయాన్ని కోరుతోంది. ఇక ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన యూబీటీ వర్చువల్‌గా సమావేశంలో పాల్గొంటామని చెప్పింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..

భారత యువ బ్యాటింగ్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మంగళవారం...

Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!

ఇజ్రాయెల్‌పై దాడి చేయబోమని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. కాల్పుల విరమణ వెల్లడించింది....

Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!

భారతీయ రైల్వే వ్యవస్థలో కొత్త మార్పులు జరగబోతున్నాయి. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా...

Mohammed Siraj: ముల్లన్‌పూర్‌ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్‌ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..

న్యూ చండీగఢ్ లోని ముల్లన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్...