2
October, 2026

A News 365Times Venture

2
Friday
October, 2026

A News 365Times Venture

IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..

Date:

భారత్, వెస్టిండీస్ మధ్య గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ వీరవిహారం చేశారు. విండీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ మైదానంలో పరుగుల వరద పారించారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 406 పరుగుల అతి భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించడమే కాకుండా, సెంచరీలతో చెలరేగిపోయారు.

ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ అసాధారణ బ్యాటింగ్‌తో అలరించాడు. కేవలం 72 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న రోహిత్, మొత్తంగా 74 బంతుల్లో 10 ఫోర్లు, 6 అద్భుతమైన సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా క్రీజులో కొనసాగుతున్నాడు. మరోవైపు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల సునామీ సృష్టించాడు. గిల్ కేవలం 85 బంతుల్లోనే ఏకంగా 17 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 144 పరుగుల వ్యక్తిగత స్కోరుతో అజేయంగా దూసుకుపోతున్నాడు.

ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు విండీస్ బౌలింగ్‌ను పూర్తిగా చిత్తు చేశారు. మొదటి వికెట్‌కు ఈ జోడీ కేవలం 156 బంతుల్లోనే అజేయంగా 254 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ప్రస్తుతం టీమిండియా 26 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 254 పరుగులు సాధించి పటిష్ట స్థితిలో ఉంది. రన్ రేట్ 9.77 వద్ద అద్భుతంగా కొనసాగుతుండగా, భారత్ విజయానికి ఇంకా 152 పరుగులు మాత్రమే అవసరమై ఉన్నాయి. గత 10 ఓవర్లలో ఏకంగా 102 పరుగులు రాబట్టడం విశేషం. రోహిత్, గిల్ ఇదే జోరు కొనసాగిస్తే భారత్ ఈ భారీ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. అంతే కాకుండా.. ఇంటర్నేషనల్ వన్డే చరిత్రలో ఒక్క మ్యాచ్‌లో 5 గురు సెంచరీలు సాధించడం ఇదే తొలిసారి. వెస్టిండీస్‌లో ముగ్గురు ప్లేయర్లు సెంచరీలు చేయగా.. భారత్‌ నుంచి రోహిత్, గిల్ సెంచరీలు చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్‌లో ఉన్నారా?

OTR: ఆంధ్రప్రదేశ్‌లో మెజార్టీ కూటమి ఎమ్మెల్యేలు డేంజర్‌ జోన్‌లో ఉన్నారా? నియోజకవర్గాల్లో...

Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..

Mamata Banerjee:  2029 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రధాని...

Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!

Modi-Trump: ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య టెలిఫోన్...

Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..

భారత్, వెస్టిండీస్ మధ్య గౌహతిలోని ఏసీఏ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డే...