14
September, 2026

A News 365Times Venture

14
Monday
September, 2026

A News 365Times Venture

IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..

Date:

మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్‌లో శ్రీలంక మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌కు బలమైన శుభారంభం అందించారు. షఫాలీ వర్మ 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేయగా, స్మృతి మంధాన 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసింది. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 12.5 ఓవర్లలోనే 129 పరుగులు జోడించారు.

ఆ తర్వాత షఫాలీ వర్మ వెనుదిరగగా, కొద్దిసేపటికే మంధాన కూడా రనౌట్ అయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 14 పరుగులు, రిచా ఘోష్ 17 పరుగులు చేశారు. దీప్తి శర్మ (5) తక్కువ పరుగులకే అవుట్ కాగా, చివరిలో భారత్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. భారత్ ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాస్ రూపంలో 3 పరుగులు వచ్చాయి.

శ్రీలంక బౌలింగ్‌లో చమరి అథపత్తు, చముడి ప్రబోధ, మిథాలి అయోధ్య చెరో వికెట్ పడగొట్టారు. పవర్ ప్లేలో భారత్ దూకుడుగా ఆడి 57 పరుగులు సాధించింది. చివరి ఓవర్లలో శ్రీలంక బౌలింగ్ కట్టుదిట్టంగా చేయడంతో భారత స్కోరు 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల వద్ద నిలిచింది. ఇప్పుడు శ్రీలంక మహిళల జట్టు ముందు 184 పరుగుల విజయలక్ష్యం నిలిచింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తొలి విదేశీ పర్యటనలో భాగంగా లండన్‌లో పర్యటిస్తున్నారు....

Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..

Bangladesh:  బ్రిక్స్ సమావేశాలకు దూరంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు తన కోపాన్ని...

BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?

BRICS: బ్రిక్స్ సదస్సు తొలి రోజు ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు...

Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో...