27
November, 2026

A News 365Times Venture

27
Friday
November, 2026

A News 365Times Venture

IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్‌ తీసిన గుర్నూర్‌.. లాథమ్‌ హాఫ్‌ సెంచరీతో దూకుడుగా..!

Date:

IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌, భారత్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ఆసక్తికరంగా సాగుతోంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ జట్టు నిలకడగా ఆడుతోంది. ఈ మ్యాచ్‌తో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన గుర్నూర్‌ బ్రార్‌ భారత్‌కు తొలి వికెట్‌ అందించాడు. కివీస్‌ ఓపెనర్‌ డేవన్‌ కాన్వే (31)ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపించాడు.

మరోవైపు న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 116 బంతుల్లో 6 ఫోర్లతో 56 పరుగులు చేసి అజేయంగా క్రీజులో కొనసాగుతున్నాడు. అతడికి హెన్రీ నికోల్స్‌ (15) సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. కాగా, లంచ్‌ విరామ సమయానికి న్యూజిలాండ్‌ 26 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 77 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో సెషన్‌లో మరో 29 పరుగులు జోడించింది. భారత బౌలర్లలో గుర్నూర్‌ బ్రార్‌ ఒక వికెట్‌ తీశాడు. బుమ్రా, అన్షుల్‌ కాంబోజ్‌, ఆకాశ్‌దీప్‌ వికెట్లు సాధించకపోయినా పరుగులను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్‌ టామ్‌ లాథమ్‌కు 300వ అంతర్జాతీయ మ్యాచ్‌ కాగా, డేవన్‌ కాన్వేకు 150వ అంతర్జాతీయ మ్యాచ్‌. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ డ్రాగా ముగియడంతో ప్రస్తుతం సిరీస్‌ 0-0తో సమంగా ఉంది. ఈ నిర్ణయాత్మక రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.

భారత జట్టు:

కేఎల్‌ రాహుల్‌, యశస్వీ జైస్వాల్‌, దేవదత్‌ పడిక్కల్‌, శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ధ్రువ్‌ జురెల్‌, ఆకాశ్‌దీప్‌, అన్షుల్‌ కాంబోజ్‌, గుర్నూర్‌ బ్రార్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా.

న్యూజిలాండ్‌ జట్టు:

టామ్‌ లాథమ్‌ (కెప్టెన్‌), డేవన్‌ కాన్వే, హెన్రీ నికోల్స్‌, రచిన్‌ రవీంద్ర, డారిల్‌ మిచెల్‌, టామ్‌ బ్లండెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, నాథన్‌ స్మిత్‌, కైల్‌ జెమీసన్‌, మ్యాట్‌ హెన్రీ, జాకబ్‌ డఫ్పీ.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

IPL Auction: ఐపీఎల్ 2027 వేలంలో బెన్ స్టోక్స్‌కు గ్రీన్ సిగ్నల్.. హ్యారీ బ్రూక్‌పై వేటు.. కారణం ఇదే..

ఐపీఎల్ 2027 వేలంలో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు అర్హత...

Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం..

Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌...

Suvendu Adhikari: బీజేపీలో చేరాలని ప్రణబ్ ముఖర్జీనే సలహా ఇచ్చారు..! సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు

Suvendu Adhikari: భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం పాటు...