Illicit relations: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎటావా జిల్లాలోని పురాన్‌పురా గ్రామంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఒక వివాహితతన ఇద్దరు కుమార్తెలను తనతో తీసుకెళ్లి, తన కొడుకును మాత్రం అక్కడే వదిలేసి.. తన భర్త తండ్రితో లేచిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా అలజడి చెలరేగింది. అయితే, తమ పిల్లలను తిరిగి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆ మహిళ భర్త రివార్డు ప్రకటించాడు. తన తండ్రి, పిల్లలను కనిపెట్టిన వారికి రూ.20,000 బహుమతిని ఇస్తామని తెలిపాడు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Pak DG Warns India: పాకిస్తాన్ పాలస్తీనా కాదు, భారత్ ఇజ్రాయెల్ కాదు: పాక్ ఆర్మీ హాట్ కామెంట్స్
అయితే, తన భార్య కుటుంబ ఆభరణాలను ఎత్తుకెళ్లిందని సదరు భర్త ఆరోపించాడు. ఇది మాత్రమే కాదు, సంఘటన జరిగి నెల రోజులు గడిచినా పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేక పోయారని నిరాశ చెందిన అతడు స్వయంగా తన భార్య, పిల్లలను కనుగొనే వ్యక్తికి 20 వేల రూపాయల బహుమతిని ఇస్తానని ప్రకటించాడు. ఈ ప్రకటనతో చాలా మంది వారిని పట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, ఈ ఘటనపై ఎటావా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ.. త్వరలోనే లేచిపోయిన వారిని పట్టుకుంటామని హామీ ఇచ్చారు. తమ పోలీసులు వేగంగా దర్యాప్తు వేస్తున్నారని తెలిపారు.