15
May, 2026

A News 365Times Venture

15
Friday
May, 2026

A News 365Times Venture

Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?

Date:

హైదరాబాద్‌లో జరుగుతున్న వరుస ఘటనలతో ఎవరిని పనిలో పెట్టుకోవాలన్నా దడుసుకునే పరిస్థితి వచ్చింది. డబ్బున్నవారికి పనిమనుషులు, డ్రైవర్లు, వాచ్‌మెన్‌లు, సెక్యూరిటీ గార్డ్స్‌ తప్పనిసరి. నేపాలీలు కాకపోతే మరొకరు. మరి పనిలో పెట్టుకునే వారిని నమ్మేదెలా..? వారి నుంచి ఎలాంటి వివరాలు, డాక్యుమెంట్లు తీసుకోవాలి..? స్థానిక పీఎస్‌లో సమాచారం ఇవ్వాలా..? ఇంతకూ పోలీసులు ఏం చెప్తున్నారు..?

నేరగాళ్లు ఎక్కడో ఉండరు.. వంట మనుషులు, పని మనుషులు, డ్రైవర్ల రూపంలో మన మధ్యే తిరుగుతుంటారు..!! యస్.. మీరు విన్నది కరెక్టే..!! ఎప్పుడు దాడి చేస్తారో.. ఎప్పుడు చంపుతారో తెలియదు. ముఖ్యంగా ఇతర దేశాలు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని గుడ్డిగా నమ్మితే అంతే సంగతులు..!! అలా వచ్చిన వారే దాడులు చేస్తున్నారు.. ఉన్నదంతా దోచుకుపోతున్నారు..! అంతేకాదు.. ఎదురు తిరిగినా.. డబ్బు, బంగారం లేదా ఇతర విలువైన వస్తువులు లభించకపోయినా.. చంపేందుకు సైతం వెనుకాడడం లేదు..!! హైదరాబాద్‌లో గత కొంత కాలంగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు హడలెత్తిస్తున్నాయి.

ఇటీవల నేపాలీల ఘటనలతో ప్రస్తుతం పనిలో ఉన్న నేపాల్‌ వాళ్లను ఉన్నఫలంగా తొలగించేస్తున్నారు కొందరు. చచ్చినా నేపాల్‌ వాళ్లను పనిలో పెట్టుకోవద్దు అనుకుంటున్నారు మరికొందరు. మరి నేపాల్‌ వాళ్లు కాకుండా ఇతర రాష్ట్రాల వారైతే ఓకేనా..? వాళ్లు కూడా ఇలాంటి క్రైమ్‌‌కి పాల్పడరని గ్యారెంటీ ఏంటి…? అలా అని తెలుగు వాళ్లను పెట్టుకుందామంటే ప్రతీ పండగకి సెలవు పెడతారు. మనం పండగ చేసుకుందామనుకున్నా… పనివాళ్లు లేక వర్క్‌ బర్డెన్‌ అవుతుంది. పోనీ పండగకు ఊరెళదాం అనుకుంటే.. ఇంట్లో పనోళ్లు, సెక్యురిటీ గార్డ్స్‌, డ్రైవర్లు ఉండరు.. మనకంటే ముందే ఊరికి వెళ్లిపోయి ఉంటారు. తప్పక వేరే రాష్ట్రాల వారిని పనిలో పెట్టుకోవాల్సి వస్తుంది.

అప్రమత్తమైన పోలీసులు ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఉన్న బడాబాబులను అప్రమత్తం చేస్తున్నారు. మీరు ఎవరిని పనిలో పెట్టుకున్నా.. వాళ్ల నుంచి పూర్తి వివరాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వారి ఆధార్‌ కార్డ్‌‌తోపాటు మరో ఐడీ తీసుకోవాలంటున్నారు. వాళ్లు చెప్తున్న పేర్లు, ఐడీల్లో మ్యాచ్‌ అవుతున్నాయా లేదా సరిచూసుకోవాలంటున్నారు. వారి ఫొటోలు, వారు చెప్తున్న చిరునామా మ్యాచ్‌ అయ్యే ఐడీ ప్రూఫ్‌ తీసుకోవాలంటున్నారు. వారి బంధువులు లేదా స్నేహితులు కూడా అదే ప్రాంతంలో కానీ.. నగరంలో ఎక్కడైనా పనిచేస్తుంటే వాళ్ల వివరాలు, వారి ఐడీ ప్రూఫ్‌లు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ వివరాలు అన్నింటినీ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చి వెరిఫై చేయించుకోవాలని చెప్తున్నారు. వాళ్లు ఇచ్చిన వివరాలు సరైనవా కాదా అని చెక్‌ చేయడంతోపాటు… వాళ్ల పేర్ల మీద ఏదైనా క్రైమ్‌ హిస్టరీ ఉందా? అనేది తెలిసిపోతుందని సూచిస్తున్నారు పోలీసులు.

అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్లు, గేటెడ్‌ కమ్యునిటీలు, సెక్యూరిటీ ఏజెన్సీలు, వాణిజ్య సంస్థలు… తమ వద్ద పనిచేసే నేపాలీలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వివరాలను మీ పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌లో అందజేయాలని సూచిస్తున్నారు. వృద్ధులు, ఒంటరిగా ఉండే వాళ్లు పనివాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద కదలికలు గమనించినా.. పోలీసులకు కానీ డయల్‌ 100కి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. పోలీసులు కూడా ప్రత్యేకంగా వెరిఫికేషన్‌ డ్రైవ్‌, నైట్‌ పెట్రోలింగ్‌, కమ్యునిటీ పోలీసింగ్‌తో అవగాహన కల్పిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారుల...

Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..

Shocking Love Story: బీహార్ లోని కతిహార్‌లో ఒక లవ్ స్టోరీ...

Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్‌హాసన్ కీలక వ్యాఖ్యలు

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో సంక్షోభం నెలకొంది. అన్ని దేశాలు...

Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం

చెన్నైలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు...