16
June, 2026

A News 365Times Venture

16
Tuesday
June, 2026

A News 365Times Venture

Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..

Date:

Hyderabad: హైదరాబాద్‌ ఐటీ హబ్‌గా పేరుగాంచిన గచ్చిబౌలిలోని ప్రముఖ ‘రాయల్ స్పైస్’ రెస్టారెంట్‌లో తాజాగా జరిగిన ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నగర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. బయటకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ హోటల్ లోపలి అసలు రంగు చూసి తనిఖీలకు వెళ్లిన అధికారులే నోరెళ్లబెట్టారు. విలాసవంతమైన వాతావరణంలో రుచికరమైన బిర్యానీలు, కూరలు ఆరగిస్తున్నామని మురిసిపోయే కస్టమర్ల ఆరోగ్యంతో ఈ రెస్టారెంట్ యాజమాన్యం ఎంతలా చెలగాటమాడుతుందో ఈ తనిఖీల్లో వెలుగుచూసింది.

ప్రధానంగా రెస్టారెంట్ కిచెన్‌లోకి అడుగుపెట్టిన అధికారులకు అక్కడ కనిపించిన దృశ్యాలు తీవ్ర అసహ్యానికి గురిచేశాయి. వంట గదిలో భారీ స్థాయిలో పురుగులు విచ్చలవిడిగా తిరుగుతూ కనిపించాయి. ఇక వాష్ ఏరియా, కిచెన్, డైనింగ్ ప్రాంతాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఎక్కడికక్కడ ఆహార వ్యర్థాలు పేరుకుపోయి, నీరు నిల్వ ఉండిపోవడంతో ఆ ప్రాంతమంతా భరించలేనంత దుర్వాసనతో నిండిపోయింది. హోటల్ గోడలు, కిటికీలు తీవ్ర అపరిశుభ్రంగా మారిపోయి, కనీస నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు వంటల్లో పరిమితికి మించి రసాయనాలతో కూడిన ఫుడ్ కలర్స్‌ను భారీగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

అంతేకాకుండా, వంటల తయారీకి ఉపయోగిస్తున్న తాగునీటి నాణ్యతకు సంబంధించిన ఎలాంటి ధ్రువపత్రాలను (Water Quality Certificates) చూపించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైంది. వీటన్నింటికీ తోడు, వండుతున్న ఆహార పదార్థాల పక్కనే మూతలు లేని చెత్త డబ్బాలను ఉంచడం అధికారులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. దీనివల్ల ఆహారం కలుషితమై ప్రజలు తీవ్ర రోగాల బారిన పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆహార భద్రతా నిబంధనలను బేఖాతరు చేస్తూ, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న రాయల్ స్పైస్ రెస్టారెంట్ యాజమాన్యానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే కఠిన నోటీసులు జారీ చేశారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఈ ఘటనతో, గచ్చిబౌలి పరిసరాల్లోని మిగతా హోటల్ నిర్వాహకుల్లోనూ ఇప్పుడు వణుకు మొదలైంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఈజీగా అవుట్ చేసే కొత్త ఆయుధం దొరికింది! బయటపడ్డ వండర్ కిడ్ బలహీనత!!

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న 15 ఏళ్ల...

Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!

Janasena Joining Committee: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ తన సంస్థాగత...

Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..

Secunderabad Bonalu 2026: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్...

Meta AI: మెటాలో అంతర్గత తిరుగుబాటు.. ‘దారుణమైన తప్పులు చేశాం’ అంటూ దిగొచ్చిన యాజమాన్యం!

Meta AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్… ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న మాయా ప్రపంచం!...