13
July, 2026

A News 365Times Venture

13
Monday
July, 2026

A News 365Times Venture

Hyderabad: ఫిలింనగర్‌లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..

Date:

Hyderabad: హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో తెల్లవారుజామున ఓ ఫెరారీ (Ferrari) స్పోర్ట్స్ కార్ బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో దూసుకొచ్చిన సదరు విలాసవంతమైన కారు రోడ్డు పక్కనే ఉన్న ఓ నివాస గృహం ప్రధాన గేటును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదం ధాటికి ఆ ఇంటి గేటు పూర్తిగా బద్దలైపోయింది.

అత్యంత వేగంగా వెళ్లి గేటును గుద్దడంతో ఫెరారీ స్పోర్ట్స్ కారు ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న యువకులు భయాందోళనతో కారును అక్కడే వదిలేసి ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. తెల్లవారుజామున పెద్ద శబ్దంతో గేటు బద్దలు కావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ కారు బీభత్సంపై సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పరారైన యువకులు మద్యం మత్తులో (డ్రంక్ అండ్ డ్రైవ్) ఉండి, కారును కంట్రోల్ చేయలేక అత్యంత వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గురైన ఫెరారీ స్పోర్ట్స్ కారును పోలీసులు క్రేన్ సహాయంతో టోవింగ్ వెహికల్‌పైకి ఎక్కించి, తదుపరి దర్యాప్తు నిమిత్తం ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రమాదం కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం, మితిమీరిన వేగం (రాష్ డ్రైవింగ్) వల్ల జరిగిందా? లేక యువకులు నిజంగానే మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టారా అనేది పోలీసుల విచారణలో తేలనుంది. ప్రస్తుతం పోలీసులు కారు నెంబర్ ఆధారంగా యజమానిని గుర్తించే పనిలో పడ్డారు. ప్రమాదం స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను సైతం పరిశీలిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం

గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భక్తుల కళ్ల ముందే 11 ఏళ్ల...

Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్

Shreyas Iyer: సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో,...

Visakhapatnam Earthquake: విశాఖలో భూప్రకంపనలు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన జనం!

Visakhapatnam Earthquake: విశాఖపట్నంలో ఆదివారం తెల్లవారుజామున భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉదయం 5...

ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్‌ను కోల్పోయిన భారత్!

ICC T20 Ranking: అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కాలంగా సాగుతున్న టీమిండియా...