22
July, 2026

A News 365Times Venture

22
Wednesday
July, 2026

A News 365Times Venture

Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్‌షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు

Date:

Home Minister Anitha: ఏపీ పోలీసు శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రీట్రీట్ – టుడేస్ వర్క్‌షాప్’లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యాలు చేశారు.. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సంస్కరణాత్మక కార్యక్రమాలు చేపట్టామని, వివిధ విభాగాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చామని హోంమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘ఫ్యూచర్ రెడీ’ వర్క్‌షాప్ పోలీసు వ్యవస్థకు ఎంతో కీలకమని ఆమె అన్నారు.

రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలను 4 శాతం మేర తగ్గించగలిగామని హోంమంత్రి వెల్లడించారు. అలాగే గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టేందుకు ‘ఈగల్’ అనే ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పారు. జిల్లా ఎస్పీలు, పోలీసు సిబ్బంది సమన్వయంతో గంజాయి సాగుపై సమర్థవంతంగా నియంత్రణ సాధించామని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడైన నాయకుడని పేర్కొన్న అనిత.. 2028 నాటికి ఆయన 50 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకుంటారని అన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరి అభిప్రాయాలను వినే నాయకత్వం ఆయనదని కొనియాడారు. తన రాజకీయ జీవితంలో అనేక మంది పోలీసు అధికారులతో కలిసి పనిచేసిన అనుభవం సీఎం చంద్రబాబుకు ఉందని తెలిపారు.

సైబర్ నేరాలు ప్రస్తుతం పెద్ద సవాలుగా మారాయని, వాటిని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి అవసరమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పోలీసులు చేసే దర్యాప్తు కంటే కొన్ని సందర్భాల్లో ప్రజలు సోషల్ మీడియాలో చేసే చర్చలు, విచారణలే ఎక్కువగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారహితంగా పోస్టులు చేయడం, అసత్య ప్రచారం చేయడం వంటి అంశాలపై పోలీసులు మరింత దృష్టి సారించాలని సూచించారు.

రాష్ట్రంలో నేరాల నియంత్రణను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. ఈ రెండు రోజుల వర్క్‌షాప్‌లో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారని తెలిపారు. వర్క్‌షాప్‌లో పాల్గొంటున్న అధికారులు తమ సలహాలు, సూచనలను నేరుగా ముఖ్యమంత్రికి అందించాలని హోంమంత్రి అనిత కోరారు. దీంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Arthritis Pain in Monsoon: వర్షాకాలంలో కీళ్ల నొప్పితో ఇబ్బందా..? నిపుణులు సూచించిన 5 చిట్కాలు మీ కోసం..

Arthritis Pain in Monsoon: వర్షాకాలం ఎండల నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ,...

Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!

Supreme Court: వైవాహిక విభేదాలు వచ్చినప్పుడు భర్త పనిచేసే సంస్థకు ఫిర్యాదు...

CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!

CJP Protest: మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP)...

Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..

Railway Bedsheet Turned Into Kurta: భారతీయ రైల్వేలకు చెందిన బెడ్‌షీట్లు,...