7
July, 2026

A News 365Times Venture

7
Tuesday
July, 2026

A News 365Times Venture

Heavy Rain Alert: తెలంగాణకు వాన ముప్పు.. ఈ 4 రోజులు జాగ్రత్త..

Date:

Telangana Heavy Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న తేలికపాటి, మోస్తరు వర్షాలు.. రాబోయే రోజుల్లో మరింత ఉధృతం కానున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడు, నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు దంచికొట్టనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో శనివారం ఉదయం ఏర్పడిన బలమైన అల్పపీడనం అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు 9.4 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా వంగి ఉంది. ఈ తీవ్ర ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనించనుంది. దీని ఫలితంగా తెలంగాణపై వాన ముప్పు గట్టిగా పొంచి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఆ నాలుగు జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కేవలం వర్షాలే కాకుండా.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పిడుగులు పడే ముప్పు ఎక్కువగా ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపరులు పొలాల్లో ఉన్నప్పుడు చెట్ల కింద అస్సలు ఆశ్రయం పొందవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సైతం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

మరోవైపు, ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలపై కూడా ఈ అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ జిల్లాల పరిధిలోని వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉండటంతో రవాణా వ్యవస్థకు అంతరాయం కలగవచ్చునని హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా, శనివారం నాడు కూడా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట్‌ మండలం ఎల్కపల్లిలో 4.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇదే జిల్లాలోని సిర్పూర్‌(టి)లో 3.8 సెం.మీ, వాంకిడిలో 3.8 సెం.మీ, ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం చాప్రాలాలో 3.5 సెం.మీ, అలాగే కామారెడ్డి జిల్లా కేంద్రంలో 3.4 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా సాగునీటి ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని ఉపనదులు ఉధృతంగా ప్రవహించే ఆస్కారం ఉండటంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల వల్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, చెట్లు విరిగిపడటం వంటి సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున.. విద్యుత్ శాఖ సిబ్బందిని ఎమర్జెన్సీ సేవల కోసం సిద్ధంగా ఉంచారు. నగరాలు, పట్టణాల్లోని మునిసిపల్ అధికారులు డ్రైనేజీ వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణాలు చేసే వారు వాతావరణ సూచనలను గమనించి, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!

Xiaomi 18 Pro Max: షియోమీ నుండి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌గా...

ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి

ITR Filing AY 2026-27: ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి కంటే...

IPS Officers: ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ..

IPS Officers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా కారణాలతో కొంతమంది ఐపీఎస్ అధికారులను...