22
June, 2026

A News 365Times Venture

22
Monday
June, 2026

A News 365Times Venture

Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!

Date:

Harmanpreet Kaur: మహిళల T20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు తొలి ఓటమిని రుచిచూసిన తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన జట్టు బౌలర్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మాంచెస్టర్‌ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జూన్ 21న జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లలో శ్రీ చరణి మూడు వికెట్లు తీయగా.. షెఫాలీ వర్మ ఒక వికెట్ తీసింది. అయితే మిగతా బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఇక మ్యాచ్ తర్వాత మాట్లాడిన జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. మాకు కొన్ని కీలక అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయామని, ఇంకా టోర్నీలో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నందున సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతామని తెలిపింది.

మ్యాచ్ మధ్యలో మాకు కొన్ని అవకాశాలు లభించాయి. అయినా వాటిని అందుకోలేకపోయాము. టోర్నీ లీగ్ స్టేజ్లో ఇంకా 2 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి కాబట్టి.. ఇప్పుడు సానుకూలంగా ఆలోచించి ముందు జరగబోయే మ్యాచ్‌ లపై దృష్టి పెడతామని తెలిపింది. శ్రీ చరణి, షెఫాలీ అద్భుతంగా బౌలింగ్ చేసారని.. వారు ప్రత్యర్థులకు సవాళ్లు విసిరారు., కానీ ఇతర బౌలర్ల నుంచి సరైన సహకారం లభించలేదు” అని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కాస్త బౌలర్లు పై అసహనం వ్యక్తం చేసింది.

ప్రస్తుతం టీమిండియా 3 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో భారత్ తన గ్రూప్‌లో రెండో స్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌ల నుంచి నాలుగు పాయింట్లు సాధించిన భారత జట్టు తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ తో తలపడనుంది. జూన్ 25న మాంచెస్టర్‌ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో నాలుగు పాయింట్లు సాధించి పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. దీంతో భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Uddhav Shiv Sena: ఉద్ధవ్‌పై కోపం లేదు, నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీ..

Uddhav Shiv Sena: ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన...

Kieron Pollard: బాబోయ్.. పాకిస్థాన్ బౌలర్‌ను కొట్టడానికి వెళ్లిన పొలార్డ్.. ఆ బౌలర్ పరిస్థితి..

మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026 సీజన్‌లో భాగంగా వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో...