27
October, 2026

A News 365Times Venture

27
Tuesday
October, 2026

A News 365Times Venture

Harmanpreet Kaur: ఇంట్లో రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని.. సెంచరీ వెనుక ఉన్న రహస్యం ఇదే..

Date:

భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఫామ్ లేని సమయంలో తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఆ సమయంలో వాటి నుంచి బయటపడటానికి ఇంటి వద్ద చేసిన కఠిన సాధనే ఉపయోగకరంగా మారిందన్నారు. జింబాబ్వేతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో 41 బంతుల్లో అజేయంగా 91 పరుగులు చేసిన ఆమె, ఆ తర్వాత వన్డే సిరీస్‌లోనూ అద్భుత ప్రదర్శన కొనసాగించారు. ముఖ్యంగా వడోదర వేదికగా జరిగిన రెండో వన్డేలో 126 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో దీప్తి శర్మతో మాట్లాడుతూ తన పునరాగమనం వెనకున్న కష్టాన్ని పంచుకున్నారు.

ఫామ్ కోల్పోయిన సమయంలో తాను ఎంతో శ్రమించానని, రోజులో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా మూడు సెషన్లలో నిరంతరం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు హర్మన్ ప్రీత్ వెల్లడించారు. తాను ఎప్పుడూ ఎక్కువ ప్రాక్టీస్ అవసరమైన ఆటగాళ్ల కోవకు చెందినదానినని పేర్కొన్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఫిట్‌నెస్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టానని, బ్యాటింగ్‌లో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి ఇంటి వద్ద గడిపిన సమయం తనకు ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. ప్రాక్టీస్ ఎంత ఎక్కువగా చేస్తే ఆత్మవిశ్వాసం అంతగా పెరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇక రెండో వన్డే మ్యాచ్‌లో ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలి వర్మ త్వరగా అవుటైనప్పటికీ, హర్మన్ ప్రీత్ ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదు. ప్రతీకా రావల్ (61 పరుగులు)తో కలిసి మూడో వికెట్‌కు 124 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆ తర్వాత దీప్తి శర్మ (అజేయంగా 106 పరుగులు)తో కలిసి మరో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ అద్భుతంగా రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించి, మ్యాచ్‌ను 121 పరుగుల తేడాతో గెలుచుకోవడంతో పాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ సహచర ఆటగాళ్లతో కలిసి ప్రణాళికాబద్ధంగా ఆడి జట్టును విజయపథంలో నడిపించిన తీరు పట్ల సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Off The Record: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పిఠాపురంలో ఆసక్తికర రాజకీయాలు..

Off The Record: పిఠాపురం టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మకు స్థానిక...

Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్‌..?

Thopudurthi Prakash Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాప్తాడు...

53 Trains Cancelled: అర్నబ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..

53 Trains Cancelled: ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు ‘అర్నబ్’ తుఫాన్‌ దూసుకువస్తోంది.....

Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?

Chairmans Desk: తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా రాజకీయం కొత్త పోకడలు పోతూనే...