17
May, 2026

A News 365Times Venture

17
Sunday
May, 2026

A News 365Times Venture

Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..

Date:

Guntur Job Fraud: గుంటూరు జిల్లాలో ఉద్యోగాల పేరుతో విద్యార్థులను మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ప్రముఖ విద్యాసంస్థ అయిన ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తమ సహచరులనే లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కడప జిల్లాకు చెందిన విజయ నరసింహ, వరుణ్ అనే విద్యార్థులు “వెబ్ ఎక్స్” పేరుతో స్టార్టప్ కంపెనీ నడుపుతున్నామని తోటి విద్యార్థులను నమ్మించినట్లు సమాచారం. తమ కంపెనీలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, భారీ ప్యాకేజీలతో ప్లేస్‌మెంట్లు కల్పిస్తామని చెప్పి పలువురిని ఆకర్షించారు.

ఈ నమ్మకంతో పలువురు విద్యార్థులు లక్షల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు డబ్బులు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మొత్తం 40 మంది విద్యార్థుల నుంచి దాదాపు కోటిన్నర రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. అయితే నెలలు గడిచినా ఎలాంటి ఉద్యోగాలు రాకపోవడంతో విద్యార్థులకు అనుమానం మొదలైంది. దీంతో విజయ నరసింహ, వరుణ్‌లను పలుమార్లు ప్రశ్నించగా వారు కమాయమాటలు చెబుతూ కాలయాపన చేసినట్లు బాధితులు చెబుతున్నారు. చివరకు మోసపోయామని గ్రహించిన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి మంగళగిరి రూరల్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థుల నుంచి సేకరించిన డబ్బు ఎక్కడికి వెళ్లింది, ఇంకా మరెవరైనా ఈ మోసంలో ఉన్నారా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగాల పేరుతో వస్తున్న ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!

Sugar Free Lassi Recipe: వేసవి కాలంలో శరీరాన్ని కూల్‌గా ఉంచేందుకు...

Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..

Droupadi Murmu: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న...

Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..

Chittoor Police: చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన నకిలీ నోట్ల మోసం...