9
July, 2026

A News 365Times Venture

9
Thursday
July, 2026

A News 365Times Venture

Gautam Gambhir: ‘వీ వాంట్ సంజూ’.. కోచ్ కీలక వ్యాఖ్యలు.!

Date:

Gautam Gambhir: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 125 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు మరింత పెరిగాయి. ముఖ్యంగా సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడంపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడో టీ20 మ్యాచ్ తర్వాత స్టేడియం బయట గంభీర్‌ను చూసిన అభిమానులు “వీ వాంట్ సంజూ.. సంజూ” అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.

సంజూను తప్పించడంపై ఆగ్రహం:

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయిన సంజూ శాంసన్, ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కూడా విఫలమయ్యాడు. దీంతో అతడిని రెండో, మూడో టీ20లకు పక్కనబెట్టి యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. అయితే ఈ నిర్ణయం అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. సోషల్ మీడియాలో గంభీర్‌ను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

జింబాబ్వే సిరీస్‌కూ:

భారత్ జింబాబ్వే పర్యటనకు ప్రకటించిన టీ20 జట్టులో కూడా సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గత టీ20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన ఆటగాడిని ఇలా పక్కన పెట్టడమేంటని అభిమానులు ప్రశ్నించారు. గంభీర్ ఇచ్చిన హామీలను కూడా గుర్తుచేస్తూ విమర్శలు గుప్పించారు.

సంజూపై గంభీర్ కీలక వ్యాఖ్యలు:

మూడో టీ20లో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన గౌతమ్ గంభీర్.. సంజూ శాంసన్‌పై స్పందించాడు. 2026 టీ20 ప్రపంచకప్‌లో సంజూ చేసిన ప్రదర్శన అసాధారణం. అయితే కొన్ని సందర్భాల్లో ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సంజూ తిరిగి జట్టులోకి రాకూడదనే ఎలాంటి నియమం లేదు. ప్రతి ఆటగాడు తన స్థానాన్ని మళ్లీ సంపాదించుకోవాలని గంభీర్ స్పష్టం చేశాడు.

ఎందుకు పక్కన పెట్టారు?

టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన సంజూ శాంసన్‌కు ఆ తర్వాత మాత్రం బ్యాట్ సహకరించలేదు. ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 5 పరుగులే చేసిన అతడు, ఇంగ్లండ్‌తో తొలి టీ20లో ఒకే పరుగుకు ఔటయ్యాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలోనే జట్టు యాజమాన్యం అతడిని బెంచ్‌పై కూర్చోబెట్టి యువ ఆటగాడికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

గెలుపు లేక ఒత్తిడిలో టీమిండియా:

శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత జట్టు వరుసగా ఐదు టీ20 మ్యాచ్‌ల్లో (ఒకటి వర్షంతో రద్దు) విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో జట్టు ఎంపిక, బ్యాటింగ్ కూర్పుపై ప్రశ్నలు మరింత పెరుగుతున్నాయి. ముఖ్యంగా సంజూ శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావాలని అభిమానులు బలంగా డిమాండ్ చేస్తున్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Peddireddy Ramachandra Reddy: తిరుపతిలో వైఎస్సార్‌కు నివాళి.. మావిగన్‌పై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Peddireddy Ramachandra Reddy: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి...

Alcohol Effects: మద్యం కాలేయానికే కాదు.. మెదడుకూ ముప్పే..! వైద్యుల హెచ్చరిక

Alcohol Effects: మద్యం సేవించడం వల్ల కాలేయం, గుండెకు మాత్రమే నష్టం...

Minister Narayana: అమరావతి వర్సెస్ మావిగన్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

Minister Narayana: అమరావతి రాజధాని నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష...