26
June, 2026

A News 365Times Venture

26
Friday
June, 2026

A News 365Times Venture

France: మ్యూజిక్ ఫెస్టివల్‌లో షాకింగ్ ఘటనలు.. సిరంజిలు గుచ్చి యువతులపై అత్యాచారాలు..

Date:

France: ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా ఏటా అత్యంత ఘనంగా నిర్వహించే ‘ఫేట్ డి లా ముసిక్’ (Fête de la Musique) సంగీతోత్సవాలు ఈసారి తీవ్ర విషాదాన్ని, భయాందోళనలను మిగిల్చాయి. మిలియన్ల సంఖ్యలో స్థానికులు, అంతర్జాతీయ పర్యాటకులు రోడ్లపైకి వచ్చి ఆనందంగా గడపాల్సిన ఈ వేడుకలు.. రాత్రికి రాత్రే హింస, ఘర్షణలు, లైంగిక దాడులతో అల్లకల్లోలంగా మారాయి. ముఖ్యంగా రాజధాని పారిస్ నగర వీధులు రణరంగాన్ని తలపించాయి. ఈ ఘోరకలిపై అంతర్జాతీయ మీడియా ‘డైలీ మెయిల్’ ప్రచురించిన కథనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

ఈ వేడుకల్లో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కొందరు దుండగులు మహిళలకు బలవంతంగా సిరంజీలతో సూదులు గుచ్చినట్లు (నీడిల్ స్పైకింగ్) విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పారిస్‌లోని బౌలేవార్డ్ డి లా మాడలీన్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగి.. ఒక మహిళ స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ సూదుల ద్వారా శరీరంలోకి ఏవైనా ప్రమాదకర రసాయనాలు ఎక్కించారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. వీటితో పాటు పండుగ వాతావరణంలో ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగిందని, పలువురు యువతులు లైంగిక దాడులకు గురయ్యారనే ఫిర్యాదులు రావడం పండుగ చీకటి కోణాన్ని బయటపెట్టింది. బాధితుల్లో కొందరు మైనర్లు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

మరోవైపు పారిస్ నడిబొడ్డున ఉన్న ‘ఛాటెలెట్’ వంటి రద్దీ ప్రాంతాల్లో గ్యాంగ్ వార్స్, కత్తిపోట్లు, వీధి గొడవలు తీవ్ర కలకలం రేపాయి. ఇరుకైన వీధుల్లో జనం ఒక్కసారిగా తోసుకోవడంతో తొక్కిసలాట జరిగే పరిస్థితులు కనిపించాయి. బ్రిటన్‌కు చెందిన స్టీవ్ అనే ప్రత్యక్ష సాక్షి ఈ భీకర వాతావరణాన్ని వివరిస్తూ.. “పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారింది. ఎక్కడ చూసినా గొడవలు, భయాందోళనలే. కనీసం అడుగు తీసి అడుగు వేయలేనంత రద్దీ, దానికి తోడు హింసతో ప్రాణాలు చేతిలో పట్టుకుని పరుగులు తీయాల్సి వచ్చింది” అని పేర్కొన్నాడు.

ఈ అల్లర్లను అణచివేయడానికి వేలాది మంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. నిఘా డ్రోన్లు, హెలికాప్టర్లతో పరిస్థితిని సమీక్షిస్తూ.. దేశవ్యాప్తంగా సుమారు 243 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో అత్యధిక అరెస్టులు పారిస్ నగరంలోనే జరిగాయి. అయితే, ఇంత పెద్ద ఎత్తున జనం వస్తారని తెలిసినా, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు రక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ భద్రతా ఏర్పాట్లపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ దాడులు, అత్యాచారాలపై ఫ్రాన్స్ అధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..

Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వ్యవహారంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్...

Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!

విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తును ప్రత్యేక...

Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!

Home Smelling Fresh Naturally: ప్రతిఒక్కరూ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఇల్లు తాజాగా,...

IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!

IPL Franchises: భారత క్రికెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్...