1
October, 2026

A News 365Times Venture

1
Thursday
October, 2026

A News 365Times Venture

Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!

Date:

Flydubai: దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో జరిగిన ఘటన ప్రపంచాన్ని కలవరపెట్టింది. కో-పైలట్, పైలట్‌పై కత్తితో దాడి చేసి విమానాన్ని నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇజ్రాయిల్ అధికారులు ప్రకారం.. విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. అయితే, ఈ మొత్తం ఘటనలో పైలట్ గాయంతో రక్తమోడుతున్నా కాక్‌పిట్ వదలకుండా 180 మంది ప్రయాణికుల్ని కాపాడారు. ఎక్కువ మంది ఇజ్రాయిల్ జాతీయులు ఉన్న ఈ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన వ్యక్తి భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌గా తేలింది. ఇజ్రాయిల్ మీడియా గుజరాత్‌కు చెందిన స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని కొనియాడుతోంది.

కాక్‌పిట్‌లో ఘర్షణ సమయంలో కో-పైలట్ కత్తితో దాడి చేసిన, విమానంపై పూర్తి నియంత్రణ కోల్పోలేదు. ఒకానొక సమయంలో నిమిషాల్లోనే విమానం 34,000 అడుగుల ఎత్తు నుంచి 14,000 అడుగులకు దిగింది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఈ ఘటనపై స్పందిస్తూ.. కో పైలట్ కెప్టెన్‌పై కత్తితో దాడి చేసి, విమానంలో వ్యవస్థల్ని తారుమారు చేసి కూల్చేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు.

ఈ మొత్తం ఘటనలో దాడి చేసిన కోపైలట్‌ను కొందరు ప్రయాణికులు అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఇతర పైలట్లు విమానాన్ని నియంత్రించేందుకు సహాయం చేసినట్లు సమాచారం. చివరకు సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో విమానం సేఫ్‌గా ల్యాండైంది. ప్రయాణికుల్ని కాపాడి స్మిత్ మచ్చర్ భారతీయుడని పలు మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఆయనకు బోయింగ్ 737 విమానాలు నడిపిన అనుభవం ఉందని నివేదికలు చెబుతున్నాయి. గాయపడిన తర్వాత స్మిత్ తబూక్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..

భారత్, వెస్టిండీస్ మధ్య గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో...

Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..

గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో...

Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..

గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో...