18
June, 2026

A News 365Times Venture

18
Thursday
June, 2026

A News 365Times Venture

Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..

Date:

Fact Check: ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ20 (E20) పెట్రోల్‌కు సంబంధించిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇథనాల్ కలిపిన ఈ పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఫ్యూయల్ క్యాప్ (పెట్రోల్ ట్యాంక్ మూత) చుట్టూ చీమలు చేరుతున్నాయనేది ఆ వీడియో సారాంశం. చూస్తుండగానే ఈ వార్త వేల మందికి చేరడంతో వాహనదారుల్లో లేనిపోని అనుమానాలు, ఆందోళనలు మొదలయ్యాయి. అసలు ఈ20 పెట్రోల్‌లో చీమలను ఆకర్షించే గుణం నిజంగానే ఉందా? లేక ఇదొక పుకారా? అనే విషయంపై తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) శాస్త్రీయ ఆధారాలతో క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది.

అసలు వివాదం ఏంటి?

ఇటీవల ‘E100’ ఇంధనానికి చట్టపరమైన అనుమతులు లభించిన తర్వాత, సోషల్ మీడియాలో ఇథనాల్ బ్లెండింగ్‌పై రకరకాల పోస్ట్‌లు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఒక వీడియో వైరల్‌గా మారింది. ఇథనాల్‌ను చెరకు నుంచి తయారు చేస్తారు కాబట్టి, ఆ తీపి వాసనకు కార్ల ఫ్యూయల్ క్యాప్స్ వద్ద చీమలు గుంపులుగా చేరుతున్నాయని కొందరు బలంగా నమ్మారు. ఈ ప్రచారంపై స్పందించిన బీపీసీఎల్ (BPCL).. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని స్పష్టం చేసింది. పెట్రోల్‌లో కలిపే ‘ఫ్యూయల్-గ్రేడ్ ఇథనాల్’ను ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా తయారు చేస్తారని కంపెనీ వివరించింది. ఫెర్మెంటేషన్ (పులియబెట్టడం), డిస్టిలేషన్ సాంకేతికత ద్వారా దీనిని తయారు చేయడం వల్ల చివరిగా వచ్చే ఇంధనంలో ఎలాంటి షుగర్ అవశేషాలు మిగలవు. అంతేకాకుండా, ఈ ఫ్యూయల్ ఇథనాల్‌లో ‘డిన్యాచురెంట్స్’ అనే రసాయనాలను కలుపుతారు. ఇవి కీటకాలు, పురుగులను దరిచేరనివ్వకుండా దూరంగా ఉంచుతాయి. కాబట్టి చీమలను ఆకర్షించే గుణాలేవీ ఇందులో ఉండవు. పెట్రోల్‌లో ఇథనాల్ కలిపినప్పటికీ, దాని నుంచి వచ్చే సాధారణ హైడ్రోకార్బన్ వాసనే ఎక్కువగా ఉంటుంది. చీమలను ఆకర్షించేంత ప్రత్యేకమైన వాసన ఇథనాల్‌కు ఉండదని బీపీసీఎల్ పేర్కొంది.అంతేకాదు.. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ కలిపిన పెట్రోల్‌లో ఫ్యూయల్ వేపర్ (ఇంధన ఆవిరి) చాలా తక్కువగా వస్తుందని కంపెనీ తెలిపింది. కాబట్టి ఇంధనం లీకై లేదా ఆవిరై చీమలు వచ్చే అవకాశమే లేదు. ఈ20 పెట్రోల్‌కు, చీమలు రావడానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పిన బీపీసీఎల్.. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి నిరాధారమైన పుకార్లను నమ్మవద్దని వాహనదారులకు విజ్ఞప్తి చేసింది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్‌ ఆవిష్కరణ.. పారిస్‌లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ

PM Modi Paris Speech: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో భారతీయ సమాజాన్ని...

Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్

జార్ఖండ్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మెజార్టీ లేకపోయినా...

Pakistan Cricket Board: పాక్ క్రికెటర్లకు పీసీబీ బంపర్ ఆఫర్.. జీతాలు, మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు..

Pakistan Cricket Board: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) 2026-27 సెంట్రల్ కాంట్రాక్ట్...

Ranchi RSS attack: ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి.. నిందితుడి ఎన్‌కౌంటర్, గాయాలు..

Ranchi RSS attack: జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇటీవల ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై...