31
October, 2026

A News 365Times Venture

31
Saturday
October, 2026

A News 365Times Venture

El Nino Impact : ఎల్‌నినో దెబ్బ.. తెలంగాణలో 23.40 లక్షల ఎకరాల్లో పంట నష్టం

Date:

రాష్ట్రంలో ఎల్‌ నినో (El Nino) ప్రభావం అన్నదాతలపై కోలుకోలేని దెబ్బతీసింది. వర్షాభావ పరిస్థితులు, తీవ్రమైన ఎండల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో ఏకంగా 23,40,000 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారికంగా వెల్లడైంది. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా కోట్లాది రూపాయల పెట్టుబడి నష్టపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

ఏయే పంటలకు ఎంత నష్టం?

ఎల్‌ నినో తీవ్రత కారణంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో అత్యధికంగా పత్తి పంట ఏకంగా 15 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. ఆ తర్వాత వరి పంట 4 లక్షల ఎకరాల్లో, కందులు 1,50,000 ఎకరాల్లో, మక్కలు 70 వేల ఎకరాల్లో, మిరప పంట సుమారు 14 వేల ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిన్నాయి. పెట్టుబడి పెట్టి చేతికి వచ్చే సమయంలో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఉమ్మడి పాలమూరు, నల్గొండ జిల్లాలపై తీవ్ర ప్రభావం

ఈ విపత్తు ప్రభావం రాష్ట్రంలోని పలు జిల్లాలపై అత్యంత తీవ్రంగా పడింది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో రైతులు భారీ నష్టాన్ని చవిచూశారు. జిల్లాల వారీగా నష్టపోయిన వివరాలను పరిశీలిస్తే, నల్గొండ జిల్లాలో అత్యధికంగా 3,58,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆ తర్వాతి స్థానాల్లో నారాయణపేటలో 2,40,000 ఎకరాలు, సంగారెడ్డిలో 2,19,000 ఎకరాలు, జనగామ జిల్లాలో 2,00,000 ఎకరాలు, నాగర్ కర్నూల్‌లో 1,78,000 ఎకరాల చొప్పున పంటలు దెబ్బతిన్నాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో 1,69,000 ఎకరాలు, ఆదిలాబాద్‌లో 1,54,000 ఎకరాలు, మహబూబ్ నగర్‌లో 1,54,000 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో 1,24,000 ఎకరాలు, భువనగిరిలో 90,000 ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. కష్టకాలంలో ఉన్న అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర సర్వే నిర్వహించాలని, ఎకరాకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్

నాలుగో టీ20 మ్యాచ్‌లో సాధించిన భారీ విజయంపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్...

చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో కలకలం రేగింది. కమ్మెట గ్రామ...

Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..

విశాఖపట్నం మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నకిలీ కరెన్సీ చెలామణి...

Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!

Israel Elections: ఇజ్రాయిల్ రాజకీయాల్లో ఇది పెను సంచలనంగా చెప్పొచ్చు. ఒది...