25
October, 2026

A News 365Times Venture

25
Sunday
October, 2026

A News 365Times Venture

El Nino: ఎల్‌నినో రికార్డ్.. తొలిసారిగా 30°Cకు చేరిన ఉష్ణోగ్రతలు..

Date:

El Nino: పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో(El Nino) ప్రపంచాన్ని భయపెడుతోంది. పసిఫిస్ ప్రాంతంలో అసాధారణ వేడితో కొత్త రికార్డు సృష్టించింది. అక్టోబర్ 22, 2026న భూమధ్య రేఖ పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సుమారు 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరినట్లు అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలనా సంస్థ (NOAA) పేర్కొంది. ఈ పరిణామాలు మరింతగా బలపడుతున్న ఎల్‌నినోను సూచిస్తున్నాయి.

ఎల్‌నినో అనేది సహజ వాతావరణ ప్రక్రియ. ఇందులో మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు సాధారణం కన్నా ఎక్కువగా వేడెక్కుతాయి. దీంతో గాలుల దిశ, మేఘాల కదలికల్లో భారీ తేడాలు చోటుచేసుకుంటాయి. ప్రపంచంలో పొడిగా ఉండే ప్రాంతాల్లో భారీ వర్షాలతో వరదలు సంభవించవచ్చు. వర్షాలు కురువాల్సిన ప్రాంతాల్లో కరువు రావచ్చు. దీంతో ప్రపంచ వాతావరణం అస్తవ్యస్తమవుతుంది. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) అంచనాల ప్రకారం, 2026 అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్య మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్‌లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉంది. డిసెంబర్ నెల నాటికి ఎల్‌నిలో ప్రభావం గరిష్టానికి చేరే అవకాశం ఉంది.

నినో 3.4గా పిలిచే ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల సగటు అసాధారణంగా జూన్‌ నెలలో సాధారణం కన్నా 1.6°C ఎక్కువగా ఉండగా, ఆగస్టులో 2.5°Cకు పెరిగినట్లు WMO తెలిపింది. అక్టోబర్-డిసెంబర్ కాలంలో ఈ వ్యత్యాసం 3.7కు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది 2015 నవంబర్‌–2016 జనవరి మధ్య నమోదైన 2.6°C రికార్డును అధిగమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

భారత్‌పై ఎఫెక్ట్..

ఎల్‌నినో వల్ల ప్రభావితమయ్యే దేశాల్లో భారత్ కూడా ఉంది. ముఖ్యంగా వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటివి చోటుచేసుకుంటాయి. భారత వాతావరణ శాఖ (IMD) గణాంకాల ప్రకారం, 2026 నైరుతి రుతుపవనాల కాలంలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే సుమారు 13 శాతం తక్కువగా నమోదైంది. ఇదే సమయంలో దక్షిణాసియాలో అనేక ప్రాంతాల్లో వచ్చే నెలల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..

జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరిగిన ఆసియా పారా గేమ్స్ 2026లో భారత...

Saurav Das: ‘‘ఢిల్లీలో ఉంటున్నట్లు ఆధారాలేవి?’’ CJP నేతకు కోర్టు ఆదేశం

Saurav Das: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కో-కన్వీనర్ సౌరవ్ దాస్‌‌కు...

Astra Missile: భారత ‘‘అస్త్ర క్షిపణి’’పై ఇండోనేషియా ఆసక్తి..

Astra Missile: భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులపై విదేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి....

Himanta Biswa Sarma: 57 ఏళ్ల వ్యక్తి Gen Zనా? రాహుల్‌ గాంధీపై హిమంత సెటైర్లు..

Himanta Biswa Sarma: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని...