21
June, 2026

A News 365Times Venture

21
Sunday
June, 2026

A News 365Times Venture

Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాదు.. అది క్రిమినల్స్ అదృష్టం.. లా అండ్ ఆర్డర్‌పై పవన్ ఘాటు వ్యాఖ్యలు..

Date:

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హోం మంత్రి కాదని, లా అండ్ ఆర్డర్ తన పరిధిలో లేదని పేర్కొంటూనే, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా బలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నేరస్తులను కుల కోణంలో చూడకూడదని, క్రిమినల్స్‌కు కులం ఉండదని స్పష్టం చేశారు.. అయితే, నేను హోం మినిస్టర్‌ కాకపోవడం.. లా అండ్‌ ఆర్డర్‌ తన పరిధిలో లేకపోవడం క్రిమినల్స్‌ అదృష్టమని పేర్కొన్నారు..

‘గుండాలకు గట్టిగా సమాధానం చెబుతాం’

గత రెండేళ్లుగా సహనంగా వ్యవహరించానని చెప్పిన పవన్ కల్యాణ్‌, ఇకపై గుండాలు, నేరగాళ్ల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తానని హెచ్చరించారు. ఒక తల్లి తన బిడ్డ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఘటనను ప్రస్తావిస్తూ, బాధితుల హక్కులను కూడా గుర్తించాలని అన్నారు. ప్రతి సంఘటనకు కులాన్ని ముడిపెట్టడం సరైన విధానం కాదని పవన్ విమర్శించారు. సమాజాన్ని విభజించే కుల రాజకీయాలు రాష్ట్రానికి హానికరమని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ కుల గొడవలను ప్రోత్సహించలేదని, తనను కుల చట్రంలో బంధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

అధికారులపై ప్రత్యేక దృష్టి

వైసీపీ పట్ల విధేయత చూపుతున్న అధికారులపై ప్రత్యేక దృష్టి పెడతానని పవన్ కల్యాణ్‌ హెచ్చరించారు. ఇప్పటి వరకు కొన్ని అంశాల్లో మౌనం పాటించానని, ఇకపై ప్రజల ముందే తన అభిప్రాయాలను వెల్లడిస్తానని తెలిపారు. మరోవైపు.. జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు మరింత చురుకుగా వ్యవహరించాలని పవన్ సూచించారు. ప్రతి సమస్యకు తాను వ్యక్తిగతంగా వెళ్లడం సాధ్యం కాదని, ప్రజా సమస్యలపై పార్టీ ప్రజాప్రతినిధులు ముందుండాలని పిలుపునిచ్చారు.

తప్పుడు అట్రాసిటీ కేసులపై ఆందోళన

తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నిరోధించాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. కొన్ని కేసుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, సుగాలి ప్రీతి, వైఎస్ వివేకానంద రెడ్డి కేసులను ప్రస్తావించారు.. లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి.. రూల్ ఆఫ్ లా బలంగా నిలబెట్టాలి.. కులాలకు.. మతాలకు వాట్సాప్ గ్రూపులు ఉన్నప్పుడు లాండ్ ఆర్డర్ కి ఎందుకు ఉండవు? అని ప్రశ్నించారు.. సమాజాన్ని బలహీనపరచడానికి రాలేదు.. గుండాల తొక్కి నార తీస్తా.. రెండేళ్లుగా చాలా సహనంగా ఉన్నాను అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Vaibhav Sooryavanshi: రెచ్చగొడితే రచ్చరచ్చే.. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్ సూర్యవంశీ..

Vaibhav Sooryavanshi: ట్రై-సిరీస్‌లోని చివరి మ్యాచ్ ఈరోజు (జూన్ 21) ఇండియా...

YS Jagan: ‘నాన్న చూపిన మార్గమే నాకు స్ఫూర్తి’.. ఫాదర్స్ డే వేళ వైఎస్ జగన్ ఎమోషనల్ పోస్ట్..

YS Jagan: ఫాదర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్...

Off The Record: ముమ్మిడివరం వైసీపీలో ముదురుతున్న వర్గపోరు!

Off The Record: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైసీపీలో గ్రూప్‌...