CSK vs SRH: ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు మరోసారి తలపడుతున్నాయి. చెన్నైలోని ప్రముఖ ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఈ సీజన్‌లో ఇరు జట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు నమోదు చేసి 12 పాయింట్లతో నిలిచింది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఇకపోతే ‘ధోని జట్టుతోనే ఉన్నాడు.. కానీ, మ్యాచ్ ఆడేంత ఫిట్‌నెస్‌తో లేడు’ అని CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచిన అనంతరం తెలిపారు.
ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే, సన్‌రైజర్స్ జట్లు మొత్తం 23 సార్లు తలపడ్డాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. సీఎస్‌కే 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. అయితే ఈ సీజన్‌లో ఇప్పటికే ఒకసారి ఇరు జట్లు తలపడగా.. ఏప్రిల్ 18న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI:
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, సమ్రాన్ రవిచంద్రన్, నితీశ్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (కెప్టెన్), శివాంగ్ కుమార్, ఎషాన్ మలింగ, సకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే.
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI:
సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబె, ప్రశాంత్ వీర్, అకేల్ హొసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, స్పెన్సర్ జాన్సన్.




