15
March, 2026

A News 365Times Venture

15
Sunday
March, 2026

A News 365Times Venture

CM Yogi: కుంభమేళాలో ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించింది

Date:

మహా కుంభమేళా ఓ కుటుంబం యొక్క తలరాత మార్చింది. కుంభమేళా ఆ కుటుంబానికి కాసుల వర్షం కురిపించింది. లక్ష కాదు.. కోటి కాదు.. ఏకంగా రూ.30 కోట్లు సంపాదించింది. ఈ వార్త చెప్పింది ఎవరో కాదు.. స్వయానా ముఖ్యమంత్రే చెప్పారు. ప్రజాప్రతినిధులు హాజరయ్యే శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రకటన చేశారు.

ఇది కూడా చదవండి: Hyderabad : మలక్ పేట్ శిరీష హత్య కేసులో ట్విస్ట్ ..

ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. 2025-26 బడ్జె్ట్‌పై చర్చ సందర్భంగా కుంభమేళాపై సీఎం యోగి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 130 పడవలు కలిగిన ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించిందని వెల్లడించారు. కుంభమేళాపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను మంగళవారం ముఖ్యమంత్రి తిప్పికొడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పడవలు నడిపిన వారంతా రోజుకి రూ.50,000 నుంచి 52,000 వేలు సంపాదించారని తెలిపారు. ఒక నేరం కూడా జరగకుండా 45 రోజులు ప్రశాంతంగా కుంభమేళా జరిగిందని స్పష్టం చేశారు. ఇక వేధింపులు, కిడ్నాప్‌లు, దోపిడీలు, హత్యలకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు. 66 కోట్ల మంది భక్తులు సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్లారన్నారు. రూ.3లక్షల కోట్ల ఆదాయం జరిగిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కుంభమేళాను అంతర్జాతీయ మీడియా కూడా ప్రశంసించిందని యోగి గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: Warangal: మెడికల్ ఆఫీసర్ల నియామకాల అక్రమాలపై స్పందించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ

మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. మహా శివరాత్రి ఫిబ్రవరి 26న కుంభమేళా ముగిసింది. దాదాపు 45 రోజుల పాటు కుంభమేళా జరిగింది. దాదాపు 66 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు చేశారు. ఇక రూ.3లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయి. దేశ, విదేశాల నుంచి భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Moinabad Farmhouse Drugs Case: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కు బెయిల్..

హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం...

Srikanth Odela: ‘ప్యారడైజ్’ సినిమాలో మోహన్ బాబు విశ్వరూపం ఆ రోజు తెలుస్తుంది: శ్రీకాంత్ ఓదేల

Srikanth Odela: న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లో ‘దసరా’ వంటి మాసివ్...

Malaika : డేటింగ్ రూమర్స్‌తో లైమ్ లైట్‌లోకి మలైకా అరోరా

మలైకా అరోరా అంటే ఐటమ్ సాంగ్స్‌ మాత్రమే కాదు.. డేటింగ్ వార్తలతో...

LPG Crisis: వారికి కేంద్రం షాక్.. “నో బుకింగ్, సిలిండర్ సరెండల్ చేయాలి “..

LPG Crisis: ఇరాన్ యుద్ధం దేశంలో వంటగ్యాస్ (LPG) ఆందోళన్ని...