14
October, 2026

A News 365Times Venture

14
Wednesday
October, 2026

A News 365Times Venture

CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!

Date:

CM Revanth Reddy: తెలంగాణలో పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.. అధికారులపై తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు.. విద్యుత్ సరఫరా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పలుమార్లు ఆదేశించినప్పటికీ పరిస్థితిలో ఎందుకు మార్పు రావడం లేదని అధికారులను ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏ ఒక్కరినీ ఉపేక్షించబోనని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నప్పటికీ ఉత్పత్తిని ఎందుకు పెంచడం లేదని సీఎం అధికారులను నిలదీశారు. బొగ్గు కొరత రాకుండా నైనీ, మహానది నుంచి బొగ్గు లింకేజీ ఏర్పాట్లు చేసినప్పటికీ యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌లో సామర్థ్యానికి అనుగుణంగా ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా విషయంలో సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయో వెంటనే వివరించాలని ఆదేశించారు.

రైతులకు విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యంపై సీరియస్
పంటలను కాపాడేందుకు అవసరమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా అధికారులు పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది తానేనని, అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు. రైతులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను సహించబోనని తేల్చిచెప్పారు. విద్యుత్ శాఖలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను సస్పెండ్ చేస్తానని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అవసరమైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జెన్‌కో సీఎండీపై కూడా సస్పెన్షన్ చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు గల కారణాలను వెంటనే తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పరిస్థితిని సమీక్షించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!

AP ZP Chairperson Reservations: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వరుసగా...

OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?

OTR: కరపత్రాల యుద్ధానికి కారకులెవరు? తండ్రీ కొడుకులైన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేని టార్గెట్‌...

AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్‌, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్‌ వివరాలివే..!

AP Local Body Elections Schedule: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల...

Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైనప్పటి...