28
November, 2026

A News 365Times Venture

28
Saturday
November, 2026

A News 365Times Venture

CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Date:

CM Chandrababu: లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపారు. హుటాహుటిన రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. కేంద్రమంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.. మహిళా రిజర్వేషన్ల కోసం దేశం గత 30 ఏళ్లుగా ఎదురుచూస్తోందని, ఇప్పుడు కేంద్రం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయానికి అన్ని పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా దేశంలో కీలక సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు.

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు
కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని చంద్రబాబు గుర్తుచేశారు. జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని గతంలో కేంద్రానికి స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని, అన్ని రాష్ట్రాల్లోనూ ఎంపీ సీట్ల సంఖ్య పెరుగుతుందని వివరించారు.

దక్షిణాదిలో 129 నుంచి 195కు ఎంపీ స్థానాలు
ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలకు కలిపి 129 లోక్‌సభ స్థానాలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. డీలిమిటేషన్ తర్వాత ఈ సంఖ్య 195కు పెరుగుతుందని వెల్లడించారు. అయితే దేశంలోని మొత్తం లోక్‌సభ స్థానాల్లో దక్షిణాదికి ప్రస్తుతం ఉన్న 23.76 శాతం వాటాలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న పరిష్కార మార్గాలను పరిశీలిస్తే 50 శాతం సీట్ల పెంపే సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు.

ఏపీలో 25 నుంచి 38కు లోక్‌సభ సీట్లు
లోక్‌సభ స్థానాల పెంపు తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీ సీట్ల సంఖ్య 25 నుంచి 38కి చేరుతుందని చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్న 4.6 శాతం వాటా పెంపు తర్వాత కూడా కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న 28 లోక్‌సభ స్థానాలు 42కు పెరుగుతాయని, ఆ రాష్ట్రానికి ఉన్న 5.16 శాతం వాటాలో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి ఇబ్బంది కలగకుండా కేంద్రం నిర్ణయం తీసుకుందని వివరించారు.

మహిళా రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతివ్వాలి
మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై దేశం మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తోందని చంద్రబాబు అన్నారు. మహిళలకు రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతున్నామని తెలిపారు. మహిళల హక్కుల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఈ నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని, దేశాభివృద్ధి కోసం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Rohit Sharma: “సవాళ్లను స్వీకరించడానికి నేను రెడీ”.. ముంబై కెప్టెన్‌గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్…

Rohit Sharma: ముంబై ఇండియన్స్‌లో మళ్లీ హిట్‌మ్యాన్ శకం మొదలుకానుంది. దాదాపు...

Constitution Day: కాంగ్రెస్‌కు రాబోయే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదు: అనురాగ్ ఠాకూర్

బీజేపీ ఎస్సి మోర్చ ఆధ్వర్యం లో నిర్వహించిన సంవిధాన్ సమ్మాన్ దివస్...

AP Local Body Elections: ఎన్నికల అనంతరం అలర్ట్.. ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు.. డీజీపీ కీలక ప్రకటన

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ, పట్టణ...