24
August, 2026

A News 365Times Venture

24
Monday
August, 2026

A News 365Times Venture

CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు

Date:

కాక్రోచ్ జనతా పార్టీ మరో ఉద్యమానికి సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అంశంపై ఢిల్లీలో మరోసారి నిరసనలకు రెడీ అయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ సెప్టెంబర్ 5న ఢిల్లీలో శాంతియుత మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గతంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్ నెరవేరడంతో జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన ఆందోళనను విరమించింది. అయితే హామీలు నిలబెట్టుకోకపోవడంతో మళ్లీ నిరసనకు సిద్దమవుతోంది.

సీజేపీ ప్రకారం.. సెప్టెంబర్ 5న నిర్వహించే మార్చ్ ఇండియా గేట్ నుంచి ప్రారంభమై ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు కొనసాగనుంది. ఈ మార్చ్‌కు నీట్ పరీక్షల తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసుల చర్యల్లో బాధితులైన వారి కుటుంబ సభ్యులు నాయకత్వం వహిస్తారని వెల్లడించింది.

విద్యాశాఖ మంత్రి రాజీనామాతో పాటు.. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు పరిహారం అందించాలని సీజేపీ గతంలో డిమాండ్ చేసింది. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని కూడా కోరింది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేందుకు అంగీకరించిందని చెబుతూ సీజేపీ ఆందోళనను విరమించింది. అయితే ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మళ్లీ ఉద్యమిస్తామని అప్పట్లోనే హెచ్చరించింది. తాజాగా సీజేపీ విడుదల చేసిన ప్రకటనలో.. జూలై 25న ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించింది. ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని, సాంకేతిక అంశాలను సాకుగా చూపుతూ స్పష్టమైన హామీలు ఇవ్వకుండా తప్పించుకుంటోందని విమర్శించింది.

దేశవ్యాప్తంగా నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల వివరాలను సేకరించి వాటిని రద్దు చేయడానికి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరినప్పటికీ.. ప్రభుత్వం ఇప్పటివరకు ఆ జాబితాను అందించలేదని సీజేపీ ఆరోపించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని ఆరోపిస్తూ.. విద్యార్థులు, యువజన సంఘాలు, యువత పెద్ద సంఖ్యలో సెప్టెంబర్ 5న ఇండియా గేట్ దగ్గరకు చేరుకోవాలని సీజేపీ పిలుపునిచ్చింది.

గత ఆందోళనల్లో ఉద్రిక్తత

నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా సీజేపీ వాలంటీర్లు, విద్యార్థులు గత నెలలో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. పార్లమెంట్ వైపు మార్చ్ చేపట్టిన సమయంలో ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురు నిరసనకారులు గాయపడ్డారు. ఘర్షణల్లో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు మార్చ్ నిర్వహిస్తామని సీజేపీ ప్రకటించడంతో.. సెప్టెంబర్ 5న ఢిల్లీలో రాజకీయంగా, పోలీసు పరంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.

ఇదిలా ఉంటే సెప్టెంబర్ 12-13 తేదీల్లో ఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ముందు కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టబోయే నిరసనలు మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఇప్పుడు ప్రపంచ నేతలు ఢిల్లీకి వస్తున్న తరుణంలో చేపడతున్న ఉద్యమం ఎటువంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందో చూడాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో సహరాన్‌పూర్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్...

Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ కుటుంబంలోని నలుగురు దారుణహత్యకు గురయ్యారు. రంగ్‌పూర్‌లోని వారి...

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..

Rain Alert: ఒడిశాపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి క్రమంగా...

Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..

Home Safety Tips: వర్షాకాలం, వేసవి కాలం వస్తే చాలు.. ఇళ్లలోకి...