9
May, 2026

A News 365Times Venture

9
Saturday
May, 2026

A News 365Times Venture

China-Pakistan: ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌కు చైనా ప్రత్యక్ష సహాయం..!

Date:

China-Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు ప్రత్యక్షంగా సహకరించినట్లు చైనా తొలిసారి అంగీకరించింది. పాకిస్తాన్‌కు తమ ఇంజనీర్లు ఆన్‌గ్రౌండ్ టెక్నికల్ సపోర్ట్ ఇచ్చినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన కీలక స్థావరాలపై దాడులు చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఇదే సమయంలో పాక్ సైన్యం, భారత్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే, భారత్ ధీటుగా స్పందించింది. పాక్ లోని వైమానిక స్థావరాలపై దాడులు చేసింది.

చైనా ప్రభుత్వ టెలివిజన్ సీసీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా(AVIC)కు ఇంజనీర్లు ఈ విషయాలను వెల్లడించారు. పాకిస్తాన్‌కు సాయం చేసిన వారిలో చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇంజనీర్ జాంగ్ హెంగ్ కూడా ఉన్నారని చెప్పారు. ఈ కంపెనీ అధునాతన యుద్ధ విమనాలు, డ్రోన్లను తయారు చేస్తుంది. ఈ సంస్థ రూపొందించిన విమానాలనే పాకిస్తాన్ కొనుగోలు చేస్తోంది.

Read Also: Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్‌గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!

‘‘ మేము ఉన్న సపోర్ట్ బేస్‌లో యుద్ధ విమానాల శబ్ధాలు, ఎయిర్ రైడ్ సైరన్లు నిరంతరం వినిపించేవి. మే నెలలో ఉదయం నుంచే 50 డిగ్రీల ఎండలు ఉండేవి. అది మాకు మానసికంగా, శారీరకంగా చాలా కఠిన పరిస్థితి’’ అని జాంగ్ హెంగ్ తెలిపారు. పాకిస్తాన్‌కు చైనా నేరుగా సాంకేతిక సహాయం అందించిందని బీజింగ్ అధికారికంగా అంగీకరించడం ఇదే తొలిసారి. ‘‘ మా యుద్ధ పరికరాలు పూర్తి సామర్థ్యంలో పనిచేయాలని మేము కోరుకున్నాము. ఇది కేవలం J-10CEకు వచ్చిన గుర్తింపే కాదు, పాకిస్తాన్ సిబ్బందితో మేము కలిసి పనిచేసిన బంధానికి కూడా నిదర్శనం’’ అని జాంగ్ హెంగ్ అన్నారు. ఇదే సమయంలో మరో ఇంజనీర్ జుడా మాట్లాడుతూ.. ఈ యుద్ధ విమానాలను మేము పిల్లల వలే చూసుకున్నామని, సరైన అవకాశం దొరికితే అద్భుత ఫలితాలు ఇస్తుందని మాకు ముందే తెలుసు అని అన్నారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పాకిస్తాన్‌కు ప్రత్యక్షంగా చైనా సహాయం చేసినట్లు రుజువైంది. చైనా నుంచి పాకిస్తాన్ 36 J-10CE ఫైటర్ జెట్లతో పాటు 250 PL-15 క్షిపణుల్ని కొనుగోలు చేసింది. ఇదే వ్యవహారంపై భారత్ సైన్యం కూడా 2025లోనే కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ ఉపయోగించిన రక్షణ సామాగ్రిలో 81 శాతం చైనాదే అని వెల్లడించింది. పాకిస్తాన్‌ను చైనా ‘‘లైవ్ ల్యాబ్’’గా ఉపయోగించుకుందని భారత్ ఆరోపించింది. ఈ సంఘర్షణ సమయంలో పాకిస్తాన్‌కు చైనా, టర్కీలు తమ మద్దతును అందించాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్‌రెడ్డి

హజ్ యాత్రికులపై ఎలాంటి భారం పడకుండా ఆ భారాన్ని తెలంగాణ ప్రభుత్వమే...

Vijay-Governor: విజయ్‌కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్

తమిళనాడులో ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. గత ఐదు రోజులుగా కొనసాగుతున్న...

YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్‌..

YS Jagan: “హలో ఇండియా” అంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌...

Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోతున్నాయా? వాహనదారులకు కేంద్రం షాక్ ఇవ్వబోతుందా?...