27
September, 2026

A News 365Times Venture

27
Sunday
September, 2026

A News 365Times Venture

CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?

Date:

CEC Impeachment: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ కేంద్రంగా దేశ రాజకీయాలు వాడీవేడిగా ఉన్నాయి. ఇటీవల, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంలో.. ఎన్నికల కమిషన్‌లో కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయని, ఎస్ఐఆర్ సహా ఓటర్ల నమోదు, తొలగింపు వంటి ప్రక్రియల్లో గత 10 నెలల్లో 14 సార్లు మరో ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు చెప్పింది. అయితే, అంతర్గత చర్చల్లో విభేదాలు, భిన్నాభిప్రాయాలు సాధారణమని, చివరకు అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగానే ప్రకటించినట్లు ఈసీ స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ విజయానికి సహాయపడేలా ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాక్రోచ్ పార్టీ సీజేపీ రాజీనామాకు 48 గంటల డెడ్‌లైన్ విధించింది. ఆయన రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా భారీగా ఉద్యమిస్తామని హెచ్చరించింది.

నిజానికి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించడం అంత ఈజీ కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానంలోనే CECను కూడా తొలగించాలి. ఆయన చెడుగా ప్రవర్తిస్తున్నారని నిరూపించబడాలి లేదా అసమర్ధుడిగా రుజువు కావాలి. అలాంటి సమయంలో మాత్రమే ఒక ప్రక్రియ ద్వారా ఆయనను తొలగించవచ్చు. భారతదేశ చరిత్రలో ఈ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించలేదు.

నోటీసుతో ప్రక్రియ మొదలు..

సీఈసీని తొలగించాలంటే ముందుగా లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్‌కు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనపై లోక్‌సభలో 100 మంది ఎంపీలు, రాజ్యసభలో 50 మంది ఎంపీల సంతకాలు అవసరం. ఆ తర్వాత లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఈ నోటీసులు స్వీకరించాలా? వద్దా? అని నిర్ణయిస్తారు. వాస్తవాల ఆధారంగా నోటీసు స్వీకరించిన తర్వాతే రెండో దశ మొదలవుతుంది.

నోటీస్ ఆమోదిస్తే..

నోటీసుల్ని ఆమోదిస్తే విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో ఒకరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నుంచి, ఒకరు హైకోర్టు న్యాయమూర్తి, మరొకరు ప్రముఖ న్యాయనిపుణులు ఉంటారు. ఆరోపణలపై కమిటీ విచారణ చేపడుతుంది. ఆధారాలు పరిశీలిస్తుంది. సీఈసీ ఆరోపణలపై సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.

పార్లమెంట్‌లో ఓటింగ్..

విచారణ తర్వాత ఆరోపణలు నిజమయ్యాయని నిరూపితమైతే, పార్లమెంట్‌ ముందుకు నివేదిక వెళ్తుంది. సీఈసీ తొలగింపు తీర్మానంపై ఉభయ సభలలో మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందితే, రాష్ట్రపతి తుది ఆమోదం ఇస్తారు. అప్పుడే సీఈసీ తన పదవి నుంచి తొలగింపబడుతారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!

భారతీయ బ్యాంకింగ్ రంగంలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. కేరళ...

CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..

CM Chandrababu: కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఏకగ్రీవ వివరణపై ఆంధ్రప్రదేశ్...

CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..

హైదరాబాద్‌లోని విప్రో సర్కిల్‌లో దివంగత మాజీ ప్రధాన మంత్రి, దేశమే గర్వించదగిన...

US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకోనున్నాయా? మళ్లీ బాంబు దాడులతో దద్దరిల్లనుందా?...