14
July, 2026

A News 365Times Venture

14
Tuesday
July, 2026

A News 365Times Venture

BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!

Date:

BSNL: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) గ్రామీణ ప్రాంతాల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను ప్రకటించింది. కేవలం నెలకు రూ.259కే హైస్పీడ్ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఉచిత OTT సదుపాయంతో ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్‌నెట్ (BharatNet) ప్రాజెక్టు, డిజిటల్ భారత్ నిధి మద్దతుతో గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించడమే ఈ ప్లాన్ ప్రధాన ఉద్దేశం.

700GB హైస్పీడ్ డేటా:

ఈ ప్లాన్‌లో వినియోగదారులకు 25 Mbps వరకు బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ లభిస్తుంది. ఆన్‌లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోమ్, వీడియో స్ట్రీమింగ్, వీడియో కాల్స్ వంటి అవసరాలకు ఇది సరిపోతుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. వినియోగదారులు 700GB వరకు పూర్తి వేగంతో డేటా ఉపయోగించుకోవచ్చు. ఆ పరిమితి దాటిన తర్వాత కూడా ఇంటర్నెట్ సేవ కొనసాగుతుంది. అయితే స్పీడ్ 2 Mbpsకు తగ్గుతుంది. వాటికీ ఎలాంటి అదనపు ఛార్జీలు మాత్రం ఉండవు.

అన్‌లిమిటెడ్ కాల్స్:

ఈ ప్లాన్‌లో దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితంగా అందిస్తారు. అంతేకాకుండా కొత్త కనెక్షన్ తీసుకునే వారికి ఉచిత ఇన్‌స్టాలేషన్ తోపాటు మోడెమ్ కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు BSNL తెలిపింది. దీంతో ప్రారంభంలో ఎలాంటి ఎక్స్ట్రా చార్జీలు ఉండవు.

ఉచితంగా OTT:

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో పాటు Waves OTT ప్లాట్‌ఫామ్‌కు కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఇందులో సినిమాలు, టీవీ షోలు, ఇతర వినోద కార్యక్రమాలను అదనపు చార్జీలు లేకుండా వీక్షించవచ్చు. తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్, ఎంటర్‌టైన్‌మెంట్ రెండూ పొందవచ్చు.

ఇదిలా ఉండగా, ఇటీవల BSNL శాటిలైట్ ఫోన్ ను కూడా మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.1,34,166గా నిర్ణయించింది. సాధారణ మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాలు, అడవులు, సముద్ర ప్రయాణాలు, గనులు, ట్రెక్కింగ్ ప్రాంతాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ ఫోన్ ఉపయోగపడేలా రూపొందించారు. దీంతో విపత్కర పరిస్థితుల్లో కూడా కమ్యూనికేషన్ కొనసాగించే అవకాశం ఉంటుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’

Vijayashanthi: రంగారెడ్డి జిల్లా షాబాద్ ఘోర హత్యాకాండపై ప్రముఖ నటి, కాంగ్రెస్...

Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్‌పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

Ram Mohan Naidu: తెలంగాణలో మరో రెండు ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి రానున్నాయి....

Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!

Mobile Theft: బిహార్‌లోని ఖగారియా జిల్లాలో ఓ మొబైల్ దొంగతనం యత్నం...

Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!

Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో...