10
September, 2026

A News 365Times Venture

10
Thursday
September, 2026

A News 365Times Venture

BRAOU Ph.D: అంబేద్కర్ వర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్.. నోటిఫికేషన్ విడుదల.. ఏ ఏ సబ్జెక్టుల్లో అంటే..

Date:

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంగ్లీష్, తెలుగు, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ, సోషియాలజీ విభాగాల్లో పీహెచ్‌డీ (Ph.D.) ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. యూజీసీ నిబంధనలు-2022 ప్రకారం కంప్యూటర్ ఆధారిత ఎంట్రన్స్ టెస్ట్ (CBT), ఇంటర్వ్యూ ద్వారా ఈ ప్రవేశాలు ఉంటాయి. సంబంధిత అనుబంధ సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో (SC/ST/BC/PwD అభ్యర్థులకు 50 శాతం) మాస్టర్స్ డిగ్రీ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

UGC-JRF, CSIR NET, GATE, CEED లో అర్హత సాధించి ఫెలోషిప్ పొందిన అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే వారు కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని ఫీజు చెల్లించి ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ, సోషియాలజీ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ చేసేందుకు అవకాశం కల్పించారు. ఇందులో తెలుగు సబ్జెక్టు మినహా మిగిలిన అన్ని సబ్జెక్టులకు బోధన, పరీక్షా మాధ్యమం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది.

ఆసక్తి గల అభ్యర్థులు విశ్వవిద్యాలయ పోర్టల్ www.braouonline.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు నమోదు ఫీజు రూ. 1500 కాగా, SC/ST/BC/PwD అభ్యర్థులకు రూ. 1000 గా నిర్ణయించారు. ప్రవేశ పరీక్ష కేవలం హైదరాబాద్‌లోనే నిర్వహించబడుతుంది.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ, రుసుము చెల్లింపు 2026 సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 2026 అక్టోబర్ 6. రూ. 500 ఆలస్య రుసుముతో 2026 అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులు 2026 అక్టోబర్ 21 నుంచి వెబ్‌సైట్ ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష 2026 అక్టోబర్ 25న మధ్యాహ్నం 02:00 గంటల నుంచి సాయంత్రం 05:00 గంటల వరకు జరుగుతుంది. ఇతర వివరాల కోసం విశ్వవిద్యాలయ అకాడమిక్ లేదా పరీక్షల నియంత్రణ అధికారులను సంప్రదించవచ్చు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అంతర్జాతీయ జలసంధి హార్ముజ్ దగ్గర మరోసారి...

Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..

Bihar Liquor Smuggling: బీహార్‌లో మద్యపాన నిషేధం అమల్లో ఉన్నప్పటికీ,...

Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు

క్రిమినల్ బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ కేసులో అరెస్టైన 59 ఏళ్ల వ్యక్తికి బాంబే...

Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..

Sweet Atukulu Recipe: పండుగలు, విశేష పూజా దినాల్లో దేవుడికి నైవేద్యం...