13
September, 2026

A News 365Times Venture

13
Sunday
September, 2026

A News 365Times Venture

Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్‌లు కడిగిన నాగార్జున..

Date:

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 తొలి వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున చేసిన ఒక అనూహ్యమైన పని హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. హౌస్‌లో కంటెస్టెంట్లు రామ్‌ప్రసాద్, రోహిత్, వంశీ ఆటతీరును ప్రత్యేకంగా అభినందించిన నాగార్జున, వారిని మరింత ప్రోత్సహించే క్రమంలో భాగంగా వారు తాగిన మిల్క్‌షేక్ గ్లాసులను స్వయంగా స్టేజ్ పైనే కడిగి అందరికీ పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చారు. స్టార్ హీరో హోస్ట్ స్థానంలో ఉండి ఇలా కంటెస్టెంట్ల ఎంగిలి గ్లాసులు కడగడం బిగ్ బాస్ చరిత్రలోనే ఒక అరుదైన , వినూత్న ఘట్టంగా నిలిచింది.

ఈ సంఘటన వెనుక హౌస్‌లో జరిగిన కొన్ని ఆసక్తికర పరిణామాలు ఉన్నాయి. కామనర్‌గా అడుగుపెట్టిన రోహిత్, హౌస్‌లో ఎవరి ఎంగిలి గ్లాసులు గానీ టీ కప్స్ గానీ కడగనని మొదటి నుంచి చెబుతూ వస్తున్నాడు. అతనికి డిష్ వాష్ డ్యూటీ కేటాయించినప్పుడు సరిగ్గా చేయకపోవడంతో నాగార్జున ఫైర్ అయ్యారు. హౌస్‌లో సెలబ్రిటీలు, కామనర్లు అనే తేడా లేకుండా అందరూ సమానమేనని, ఎంగిలి గ్లాసులు కడగనని అహం ప్రదర్శిస్తే ఇక్కడ నుంచి బయటకు వెళ్లిపోవచ్చని గట్టిగా హెచ్చరించారు. రోహిత్‌కు ఈ విషయాన్ని కళ్ళకు కట్టినట్లు అర్థం చేయించేందుకే హోస్ట్ నాగార్జున స్వయంగా ఆ గ్లాసులు కడిగి నిరూపించారు.

ఇదే ఎపిసోడ్‌లో త్రిగుణ్ తోటి కంటెస్టెంట్ రోహిత్ విషయంలో మాట్లాడిన కొన్ని మాటలను నాగార్జున గట్టిగా నిలదీశారు. స్టిరాయిడ్ బాడీ, డొల్ల, పిల్ల బచ్చా అంటూ త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అలాంటి పదాలు ఎందుకు ఉపయోగించావని ప్రశ్నించారు. ఈ తప్పుకు శిక్షగా త్రిగుణ్‌కు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న బరువైన టైర్‌ను ఎత్తుకుని గార్డెన్ ఏరియా మొత్తం తిరగాలని ప్రత్యేక శిక్షను ఖరారు చేశారు.

మరోవైపు ఇప్పటికే హౌస్‌లో అనూహ్యంగా ఇద్దరు కంటెస్టెంట్లు మిడ్-వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వెళ్ళిపోయారు. అందులో చరణ్ ఒకరు కాగా, మరొకరు చైత్రరాయ్. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ వారం సాధారణ ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదని నాగార్జున పరోక్షంగా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి మొదటి వారం వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున వేసిన సంచలన నిర్ణయాలు, ఇచ్చిన పవర్‌ఫుల్ క్లాస్‌లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..

PM Modi-Xi Jinping: 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత చైనా అధ్యక్షుడు...

Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..

Suvendu Adhikari: బంగ్లాదేశ్ కస్టడీలో ఉన్న హిందూ సన్యాసి చిన్మోయ్ కృ‌ష్ణదాస్...

WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..

పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్‌ జట్టు క్లీన్‌స్వీప్‌ చేయడంతో ఐసీసీ...

PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..

PM Modi: గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు...