2
October, 2026

A News 365Times Venture

2
Friday
October, 2026

A News 365Times Venture

Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!

Date:

అన్ని శనివారాలు బ్యాంకులకు సెలవులు అంటూ తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసినట్లుగా ఒక గెజిట్ చక్కర్లు కొడుతోంది. ఎస్‌బీఐతో సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి శనివారం సెలవు దినంగా ప్రకటించిందని వార్త హల్‌చల్ చేస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త నకిలీ వార్తగా కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIB Fact Check స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఇలాంటి నోటిఫికేషన్ ఏదీ జారీ కాలేదని వెల్లడించింది.

ప్రస్తుతం దేశంలోని బ్యాంకులకు ప్రతి నెల రెండో, నాలుగో శనివారాలు సెలవు ఉంటుంది. మొదటి, మూడో, ఐదో శనివారాలు సాధారణంగా బ్యాంకులు పనిచేసే రోజులు. అందువల్ల ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు ఉంటుందన్న ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. బ్యాంకులకు సంబంధించిన ఈ ఫేక్ నోటిఫికేషన్ వైరల్ కావడానికి మరో కారణం ఇటీవల జరిగిన పరిణామాలు. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే బ్యాంక్ యూనియన్లతో జరిగిన చర్చల తర్వాత సమ్మెను వాయిదా వేశారు.

యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) మధ్య జరిగిన చర్చల అనంతరం సెప్టెంబర్ 28–30 తేదీల్లో నిర్వహించాల్సిన మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేశారు. పెండింగ్‌లో ఉన్న పలు అంశాలతో పాటు ఐదు రోజుల బ్యాంకింగ్ వర్కింగ్ వీక్ డిమాండ్‌పై చర్చించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడానికి ఇరు వర్గాలు అంగీకరించాయి. అయితే దీనర్థం ప్రస్తుతం అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించినట్లు కాదని PIB Fact Check స్పష్టం చేసింది.

నకిలీ పత్రం

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ పత్రంపై సెప్టెంబర్ 30, 2026 తేదీ ఉంది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి శనివారం తక్షణమే సెలవుగా ప్రకటిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే ఆ పత్రం అధికారికంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది కాదని PIB Fact Check వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద సమాచారం కనిపిస్తే దాన్ని ధృవీకరణ కోసం ఫ్లాగ్ చేయాలని ప్రజలకు సూచించింది. కాబట్టి ప్రస్తుతం అన్ని శనివారాలు బ్యాంకులకు సెలవులు కావు. రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే బ్యాంకులకు సాధారణ సెలవు కొనసాగుతోంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్

సముద్రంలో సరదాగా సాగాల్సిన ఓ ప్రయాణం ఒక్కసారిగా తల్లకిందులైంది. 18 గంటల...

Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!

Flydubai Attack:  ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనలో భారత కెప్టెన్ స్మిత్...

CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!

CJP Protest: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ...

Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి

నేపాల్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. విదేశీ పర్వతారోహకుల కోసం హిమాలయాల్లో బేస్...