28
June, 2026

A News 365Times Venture

28
Sunday
June, 2026

A News 365Times Venture

Bangladesh Cricketers: క్రికెటర్ల శాలరీ పెరిగాయ్.. ఒకొక్కరికి ఎంతంటే..

Date:

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) దేశీయ క్రికెటర్ల జీతాలు, మ్యాచ్ ఫీజులను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడు, నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ పెంపును తమీమ్ ఇక్బాల్ నేతృత్వంలోని అడ్-హాక్ కమిటీ ఆమోదించింది.

మహిళా క్రికెటర్ల ఫీజుల్లో భారీ మార్పు..
ఇంతకుముందు మహిళా క్రికెటర్లకు ఒక వన్డే మ్యాచ్‌కు కేవలం 1,000 టాకాలు (సుమారు రూ.750) మాత్రమే ఇచ్చేవారు. ఈ విషయం తెలుసుకున్న తమీమ్ ఇక్బాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం.. మహిళల వన్డే మ్యాచ్ ఫీజు 1,000 నుంచి 15,000 టాకాలకు పెరిగింది. టీ20 మ్యాచ్‌కు 10,000 టాకాలు, ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌కు 20,000 టాకాలు చెల్లిస్తారు. టాప్ 36 మహిళా క్రీడాకారుల నెలవారీ జీతం (Retainer) 30,000 నుంచి 40,000 టాకాలకు పెరిగింది.

పురుషుల క్రికెటర్ల జీతాల వివరాలు..
పురుషుల డొమెస్టిక్ క్రికెటర్ల జీతాలను కూడా పెంచారు. కేటగిరీ A ప్లేయర్లకు నెలకు 65,000 టాకాలు, కేటగిరీ B కి 50,000 మరియు కేటగిరీ C కి 40,000 టాకాలు లభిస్తాయి. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఫీజును 70,000 నుండి 1,00,000 టాకాలకు (43% పెంపు) పెంచారు.

Also Read:Fire Accidnet: ప్రభాస్ సినిమా ‘స్పిరిట్’ సెట్‌లో అగ్ని ప్రమాదం..

తమీమ్ ఇక్బాల్ సంస్కరణలు..
ఆటగాళ్లకు ఇచ్చే వేతనం చాలా తక్కువగా ఉందని, వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం అందించడం బోర్డు బాధ్యత అని తమీమ్ పేర్కొన్నారు. కేవలం జీతాలే కాకుండా.. గత 18 నెలలుగా దెబ్బతిన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతిష్టను తిరిగి పునరుద్ధరించడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ మార్పులు కేవలం ఆరంభం మాత్రమేనని.. భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు వస్తాయని ఆయన సూచించారు. ఈ నిర్ణయం వల్ల బంగ్లాదేశ్ దేశీయ క్రికెటర్లకు ఆర్థిక భరోసా లభించనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Donald Trump: భారత్‌ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?

Donald Trump: భారత్, అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక, వాణిజ్య బంధాలు...

55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..

itel Power 451 Launch: బడ్జెట్ ఫీచర్ ఫోన్ విభాగంలో వినియోగదారులను...

SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..

SS Rajamouli: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన దృశ్య...