28
October, 2026

A News 365Times Venture

28
Wednesday
October, 2026

A News 365Times Venture

Arnab Cyclone Alert: తుఫాన్ విరుచుకుపడుతుంది.. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వండి.. సీఎం ఆదేశాలు..

Date:

Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు అర్నబ్‌ తుఫాన్‌ దూసుకొస్తుంది.. ఇక, బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ నేప‌థ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో సీఎం వర్చువల్‌గా సమీక్షించారు. రేపటి కల్లా తీవ్ర తుఫానుగా మారి ఇది రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరికల రీత్యా ఆయా తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

ఈ నెల 28వ తేదీన అర్నబ్ తీవ్ర తుఫాన్‌ బాపట్ల-విశాఖ మధ్య యానాం వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు. తుఫాను కారణంగా రేపు మధ్యాహ్నం నుంచి శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకూ వివిధ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని తెలిపారు. అలాగే తీరప్రాంతాల వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని సీఎంకు తెలియచేశారు. తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పలనాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ నెల 28,29 తేదీల్లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. అర్నబ్ తుఫాన్ విషయంలో రాష్ట్రం తీసుకుంటున్న ముందస్తు చర్యలను ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

తుఫాను ప్రభావం నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను తుఫాను షెల్టర్లకు తరలించాలని సీఎం చంద్రబాబు నిర్దే్శించారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు, శిశువులకు తొలి ప్రాధాన్యతనిచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 4,711 మంది గర్భిణీలను ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు, ఆస్పత్రులకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రభావిత జిల్లాల్లోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య బృందాలను, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రాష్ట్రంలో 7 ఎన్డీఆర్ఎఫ్ 8 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను 11 ప్రభావిత జిల్లాల్లో మొహరించాలని సీఎం సూచించారు. ఎన్టీఆర్, విశాఖపట్నం జిల్లాల్లో అదనపు బలగాలను రిజర్వ్‌లో ఉంచాన్నారు. మెరైన్ పోలీసులతో పాటు నౌకాదళంతోపాటు కోస్టుగార్డుల సేవలను ఈ తుఫాన్ సహాయక చర్యల్లో వినియోగించుకునేలా చూడాలని సీఎం నిర్దేశించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ సురక్షితంగా తీరప్రాంతానికి తిరిగి రప్పించామని అధికారులు వివరించారు. మొత్తం 30,043 పడవలు సురక్షితంగా హార్బర్‌లకు చేరుకున్నాయని తెలిపారు. తుఫాను బలహీన పడి సముద్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకూ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు.

కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖను ముఖ్యమంత్రి నిర్దేశించారు. దాదాపు 1.82 లక్షల హెక్టార్లలోని ఉద్యాన పంటలకు ముప్పు పొంచివున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రేషన్ దుకాణాల్లోనూ సరకులు అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం వచ్చిన చోట తక్షణమే పునరుద్ధరించేలా చూడాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు తుపాను గమనాన్ని అంచనా వేస్తూ ప్రతీ నాలుగు గంటలకూ ప్రజలకు హెచ్చరికతో కూడిన బులెటిన్ జారీ చేయాలని దిశానిర్దేశం చేశారు. గతంలో వచ్చిన తుఫాన్ల సమాచారాన్ని విశ్లేషిస్తూ రైతులకు, ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరించాలని సూచించారు. అలాగే ఆర్నబ్ తుఫాను కారణంగా వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మొత్తం 22 రిజర్వాయర్ల పరిధిలో వరద ప్రవాహాలు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రవాహాలతో 10-12 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

తాండవ, రైవాడ, యేలేరు, తమ్మిలేరు, ఎర్రకాలువ, తాడిపూడి రిజర్వాయర్లకు పూర్తి స్థాయిలో నీటి నిల్వలు వచ్చే అవకాశం ఉందని సీఎం అన్నారు. వాగులు, వంకలు, కాలువల ప్రవాహాలకు అడ్డంకి లేకుండా చూడాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తుఫాను ప్రభావంపై దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలని సీఎం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇక తుఫాన్ ప్రభావం ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందో చూసి.. ఆ మేరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం సూచించారు. ప్రతి తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి గంట గంటకూ అధికారుల నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఈ సమీక్షకు సీఎస్ సాయి ప్రసాద్, ఆర్టీజీఎస్, విపత్తు నిర్వహణ సహా వివిధ శాఖల అధికారులు, మంత్రి రామానాయుడు వర్చువల్‌గా హాజరయ్యారు. కాగా, ఇప్పటికే తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, విజయనగరం, కాకినాడ, ఎన్టీఆర్, విశాఖ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు మంగళవారం, బుధవారం అధికారులు సెలవులు ప్రకటించిన విషయం విదితమే..

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Arnab Cyclone Alert: బీభత్సం సృష్టిస్తోన్న అర్నబ్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..!

Arnab Cyclone Alert: అర్నబ్ పెను తుఫాన్‌ ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు...

Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!

Arnab Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో...

Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా ‘అర్నబ్’.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్

Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌ వైపు అర్నబ్‌ తుఫాన దూసుకొస్తున్న సమయంలో...

Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..

భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల విరామం తర్వాత...