27
October, 2026

A News 365Times Venture

27
Tuesday
October, 2026

A News 365Times Venture

Arnab Cyclone Alert: తుఫాన్‌పై హైఅలర్ట్‌.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దు..!

Date:

Arnab Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్‌’ తుఫాన్‌ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి హైఅలర్ట్‌ ప్రకటించినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అమరావతిలోని విపత్తుల నిర్వహణ విభాగం, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తుపాను గమనం, తీవ్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. తీరప్రాంత ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని హోంమంత్రి స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

గంటకు 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
అర్నబ్‌ తుఫాన్‌ ఇవాళ అర్ధరాత్రికి తీవ్ర తుఫాన్‌గా, రేపు అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఎల్లుండి ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశాలున్నాయని తెలిపారు. తుఫాన్‌ తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం
తుఫాన్‌ ప్రభావం ఉండే జిల్లాలకు ఇప్పటికే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్‌ఎఫ్‌), అగ్నిమాపక సిబ్బందిని తరలించినట్లు హోంమంత్రి వెల్లడించారు. అవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తుపాను ప్రభావాన్ని నిరంతరం అంచనా వేస్తూ, పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దు
ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉందని నిర్లక్ష్యం వహించవద్దని హోంమంత్రి ప్రజలకు సూచించారు. మంగళ, బుధవారాల్లో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రయాణాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. రాబోయే మూడు రోజులపాటు తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పుకార్లు నమ్మొద్దు.. అధికారిక సమాచారాన్నే అనుసరించాలి
తుఫాన్‌ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ప్రచారమయ్యే పుకార్లు, వదంతులను ప్రజలు నమ్మవద్దని హోంమంత్రి అనిత హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ), ఆర్టీజీఎస్‌ జారీ చేసే అధికారిక హెచ్చరికలు, సూచనలను మాత్రమే అనుసరించాలని కోరారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటోందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Murmura Recipe: ఇంట్లోనే కరకరలాడే మరమరాలు తయారు చేసుకోండి.. సులభమైన తయారీ విధానం ఇదిగో!

Murmura Recipe: మరమరాలకు ప్రత్యేక స్థానం ఉంది.. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లినా.....

Ind Vs NZ: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. బరిలోకి దిగనున్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్..

భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్...

Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్‌.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు

Ramdev on Owaisi: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగున్నా.....

Ethanol Cars: ఇండియాలో ఇక పెట్రోల్ కార్లకు స్వస్తి.. E100 ఇథనాల్ ఫ్యూయల్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్..

భారతదేశంలో సంప్రదాయ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ వాడకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం...