26
November, 2026

A News 365Times Venture

26
Thursday
November, 2026

A News 365Times Venture

AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు

Date:

AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవాల వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,171 సర్పంచ్ స్థానాలు, 19,651 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల వివరాలు వెల్లడిస్తున్నాయి. మిగిలిన స్థానాలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కావడం విశేషం.

52 రెవెన్యూ డివిజన్లు, 246 మండలాల్లో ఎన్నికలు
రాష్ట్రవ్యాప్తంగా 52 రెవెన్యూ డివిజన్లు, 246 మండలాల పరిధిలోని 4,975 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో 1,171 పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 3,803 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ పదవుల కోసం మొత్తం 10,292 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 342 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

జిల్లాల వారీగా ఏకగ్రీవాల వివరాలు
జిల్లాల వారీగా పరిశీలిస్తే తిరుపతి జిల్లాలో అత్యధికంగా 136 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక్కడ 1,712 వార్డు సభ్యుల స్థానాలు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. కడప జిల్లాలో 116 సర్పంచ్ స్థానాలు, 1,284 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కాగా, పల్నాడు జిల్లాలో 98 సర్పంచ్ స్థానాలు, 1,144 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నెల్లూరు జిల్లాలో 93 సర్పంచ్ స్థానాలు, 1,230 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కాగా, చిత్తూరు జిల్లాలో 80 సర్పంచ్ స్థానాలు, 1,526 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రకాశం జిల్లాలో 75 సర్పంచ్ స్థానాలు, 994 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కాగా, నంద్యాల జిల్లాలో 72 సర్పంచ్ స్థానాలు, 828 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇక, విజయనగరం జిల్లాలో 64 సర్పంచ్ స్థానాలు, 855 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అనంతపురం జిల్లాలో 51 సర్పంచ్ స్థానాలు, 950 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కాగా, శ్రీకాకుళం జిల్లాలో 46 సర్పంచ్ స్థానాలు, 1,090 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అనకాపల్లి జిల్లాలో 33 సర్పంచ్ స్థానాలు, 503 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కాగా, పార్వతీపురం మన్యం జిల్లాలో 32 సర్పంచ్ స్థానాలు, 555 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 31 సర్పంచ్ స్థానాలు, 571 వార్డు సభ్యుల స్థానాలు, తూర్పు గోదావరి జిల్లాలో 25 సర్పంచ్ స్థానాలు, 446 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

గుంటూరు జిల్లాలో 21 సర్పంచ్ స్థానాలు, 348 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కాగా, అన్నమయ్య జిల్లాలో 21 సర్పంచ్ స్థానాలు, 751 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాకినాడ, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో చెరో 20 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాకినాడలో 444, కోనసీమలో 694 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. కృష్ణా జిల్లాలో 17 సర్పంచ్ స్థానాలు, 419 వార్డు సభ్యుల స్థానాలు, బాపట్ల జిల్లాలో 17 సర్పంచ్ స్థానాలు, 392 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కర్నూలు జిల్లాలో 17 సర్పంచ్ స్థానాలు, 381 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కాగా, ఏలూరు జిల్లాలో 34 సర్పంచ్ స్థానాలు, 753 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

మార్కాపురం జిల్లాలో 33 సర్పంచ్ స్థానాలు, 425 వార్డు సభ్యుల స్థానాలు, ఎన్టీఆర్ జిల్లాలో 11 సర్పంచ్ స్థానాలు, 229 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పోలవరం జిల్లాలో 4 సర్పంచ్ స్థానాలు, 122 వార్డు సభ్యుల స్థానాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 4 సర్పంచ్ స్థానాలు, 655 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 350 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైనట్లు వివరాలు వెల్లడయ్యాయి. మొత్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు నమోదయ్యాయి. ఏకగ్రీవం కాని సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండటంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. 10,292 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవుల కోసం బరిలో ఉండటంతో పల్లెల్లో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారనుంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Thiruparankundram Deepam Controversy: కార్తీక దీపం వివాదంలో మరో ట్విస్ట్…! గవర్నర్ సీరియస్.. సీఎం విజయ్‌కు కీలక ఆదేశాలు!

Thiruparankundram Deepam Controversy: తమిళనాడులోని తిరుపరంకుండ్రం కార్తీక దీపం వివాదం మరోసారి...

CM Chandrababu: గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం చంద్రబాబు.. రేషన్ షాపుల్లో తక్కువ ధరకే కందిపప్పు, పామాయిల్..

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి సామాన్య ప్రజలపై...

Trump Tariffs: ట్రంప్ టారిఫ్ బాంబ్.. భారత్‌పై 25, చైనాకు 40 శాతం..

అమెరికా వాణిజ్య ప్రతినిధి కొత్త ప్రణాళిక ప్రకారం భారత్‌తో పాటు మరికొన్ని...