6
November, 2026

A News 365Times Venture

6
Friday
November, 2026

A News 365Times Venture

AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై డీజీపీ కీలక ప్రకటన.. ఉపేక్షించేది లేదని వార్నింగ్..

Date:

AP MPTC ZPTC Elections: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.. గతంలో మున్సిపల్‌ ఎన్నికల సమయంలో కొన్ని సమస్యలు వెలుగులోకి రాగా.. ఈ రోజు జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా కొన్ని ఘటనలు జరిగాయి.. అయితే, ఇవాళ్టి ఎన్నికపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసిందని వెల్లడించారు. అయితే, ఎన్నికల సందర్భంగా 15 జిల్లాల పరిధిలో మొత్తం 37 ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. కడప, అనంతపురం, కర్నూలు తదితర జిల్లాల్లో ఈ ఘటనలు జరిగినట్లు పేర్కొన్నారు.

ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై పోలీసుశాఖ సమగ్ర దర్యాప్తు చేపట్టనుంది. పోలింగ్‌కు ఆటంకం కలిగించిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను డీజీపీ ఆదేశించారు. అలాగే ఎన్నికల అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు హరీష్ కుమార్ గుప్తా..

28 జిల్లాల్లో భారీ పోలీసు బందోబస్తు
రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో 582 జెడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసుశాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 17,555 పోలింగ్ ప్రాంతాలు, 31,472 పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల భద్రతా విధుల్లో మొత్తం 40,679 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇక, పోలింగ్ ప్రక్రియ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను సురక్షితంగా తరలించేందుకు పటిష్ట పోలీసు భద్రత కల్పించాలని డీజీపీ ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధుల్లో అంకితభావంతో పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని డీజీపీ అభినందించారు. భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తూ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా కృషి చేసిన ప్రతి ఒక్కరినీ ప్రశంసించారు. మరోవైపు ఎన్నికల సందర్భంగా నమోదైన 37 ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం

Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. ప్రజారోగ్యాన్ని...

APPSC Group 1 Evaluation Scam: ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్‌.. ఈడీ మెరుపు దాడులు.. కీలక ఆధారాల సేకరణ

APPSC Group 1 Evaluation Scam: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్...

Central Government Funds: గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..

Central Government Funds: పండుగల సీజన్‌లో రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది కేంద్ర...

Telangana Cabinet Decisions: కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!

Telangana Cabinet Decisions: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ...