22
September, 2026

A News 365Times Venture

22
Tuesday
September, 2026

A News 365Times Venture

AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు

Date:

AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 సంవత్సరానికి ఏ4 మద్యం దుకాణాల రెన్యువల్ గడువును మరో రెండు రోజుల పాటు పొడిగించారు. మద్యం దుకాణాల యజమానుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటికే ఉన్న దుకాణాలను రెన్యువల్ చేసుకునేందుకు ఈ నెల 23వ తేదీ వరకు అదనపు అవకాశం లభించింది. 2026–27 సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 ఏ4 మద్యం దుకాణాలను నోటిఫై చేశారు. వీటిలో ఇప్పటివరకు 2,726 మద్యం దుకాణాల రెన్యువల్ పూర్తయింది. మిగిలిన దుకాణాల యజమానులు కూడా గడువులోగా రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు ఈ పొడిగింపును ఉపయోగించుకోవచ్చు. మద్యం దుకాణాల రెన్యువల్ ద్వారా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.676 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. గడువు మరో రెండు రోజులు పొడిగించడంతో మిగిలిన దుకాణాల రెన్యువల్ ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది.

కాగా, ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని లిక్కర్‌ షాపుల లైసెన్స్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. 2026-27 ఎక్సైజ్ విధానంలో భాగంగా 3,736 మద్యం దుకాణాల లైసెన్సుల గడువును మరో ఏడాది పాటు పొడిగిస్తూ జీవో జారీ చేశారు.. అయితే, ఈ పొడిగింపు నిర్ణయం అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.. కొత్త పాలసీలో భాగంగా ప్రభుత్వం నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేసేలా చర్యలకు పూనుకుంది.. ప్రతి లిక్కర్‌ షాప్‌లోనూ తప్పనిసరిగా 4 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది.. నిబంధనల ఉల్లంఘనలను నిశితంగా పరిశీలించేందుకు 24 గంటల పాటు పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయనుంది సర్కార్‌.. అయితే, రెన్యువల్‌ గడువు ఇవాళ్టితో ముగియగా.. మరో రెండు రోజులు ఆ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Off The Record: ఒకే పార్టీకి రెండు ఆఫీసులా..? అక్కడ బీజేపీలో పీక్స్‌కు చేరిన గ్రూప్ వార్..!

Off The Record: మెదక్‌ జిల్లాలో బీజేపీ పరిస్థితి రెండు నియోజకవర్గాలు,...

Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్‌స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు...

US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!

ఇరాన్‌కు చెందిన ఎయిర్‌లైన్స్‌పై అమెరికా మరింత కఠినమైన ఆంక్షలు విధిస్తోంది. సెప్టెంబర్...