27
September, 2026

A News 365Times Venture

27
Sunday
September, 2026

A News 365Times Venture

AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు

Date:

AP I&PR Wins SKOCH Awards: ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి. ఏపీ సమాచార, పౌర సంబంధాల (ఐ&పీఆర్) శాఖకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. శాఖ చేపట్టిన డిజిటల్, మీడియా సంబంధిత కార్యక్రమాలకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు దక్కాయి. పారదర్శకత, సాంకేతికత ఆధారంగా చేపట్టిన కార్యక్రమాలకు ఈ అవార్డులు లభించడం పట్ల శాఖ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మీడియా అక్రిడిటేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు సిల్వర్ అవార్డు
ఏపీ ఐ&పీఆర్ శాఖ రూపొందించిన మీడియా అక్రిడిటేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ (MAMS)కు స్కోచ్ సిల్వర్ అవార్డు లభించింది. మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభంగా నిర్వహించేందుకు రూపొందించిన ఈ వ్యవస్థకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌కు గోల్డ్ స్కోచ్ అవార్డు
ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌కు కూడా ప్రతిష్టాత్మక గోల్డ్ స్కోచ్ అవార్డు లభించింది. అమరావతి క్వాంటం వ్యాలీ డిజిటల్, సోషల్ మీడియా మార్కెటింగ్ కార్యక్రమానికి ఈ అవార్డు దక్కింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను వినియోగిస్తూ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో చేపట్టిన కార్యక్రమాలకు ఈ గుర్తింపు లభించినట్లు అధికారులు తెలిపారు.

ఐ&పీఆర్ డైరెక్టర్ విశ్వనాథన్ మార్గదర్శకత్వంలో శాఖకు ఈ అరుదైన మైలురాయి దక్కిందని అధికారులు తెలిపారు. శాఖలో చేపడుతున్న డిజిటల్, సాంకేతిక సంస్కరణలు, పారదర్శక విధానాలకు స్కోచ్ అవార్డులు గుర్తింపుగా నిలిచాయని పేర్కొన్నారు. ఇక, ఈ అవార్డులు మొత్తం టీమ్ ఐ&పీఆర్ అంకితభావానికి దక్కిన గుర్తింపుగా అధికారులు పేర్కొన్నారు. శాఖలోని అధికారులు, సిబ్బంది సమష్టి కృషి ఫలితంగానే జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు సాధ్యమైందని తెలిపారు. మరోవైపు.. ఐ&పీఆర్ డైరెక్టర్ తరఫున జాయింట్ డైరెక్టర్ ఐ. సూర్యచంద్రరావు అవార్డును అందుకున్నారు. జాతీయ స్థాయిలో ఏపీ ఐ&పీఆర్ శాఖకు, ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌కు లభించిన ఈ అవార్డులు శాఖ చేపడుతున్న డిజిటల్, మీడియా సేవలకు గుర్తింపుగా నిలిచాయని అధికారులు పేర్కొన్నారు.

చాలా సంతోషంగా ఉంది.. ఇదే స్ఫూర్తి కొనసాగాలి..
ఇక, ఈ అవార్డులపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన మంత్రి కొలుసు పార్థసారథి.. “ఢిల్లీలో జరిగిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ కు గోల్డ్ స్కోచ్ అవార్డు దక్కడం ఎంతో గర్వకారణం. డిజిటల్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఆఫ్ అమరావతి ‘క్వాంటం వ్యాలీ’ అంశంలో (అమరావతి) డిజిటల్ కార్పొరేషన్ గోల్డ్ స్కోచ్ అవార్డును అందుకుంది. డిజిటల్ కార్పొరేషన్ ఈడి రాణి సుస్మిత, స్పెషల్ ఆఫీసర్ శేషు కుమార్ గోల్డ్ స్కోచ్ అవార్డును అందుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. డిజిటల్ కార్పొరేషన్ ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రగతిని ప్రజల్లోకి బలంగా పంపించే అంశాలు రాష్ట్రానికి గర్వకారణమైన స్కోచ్ అవార్డును సాధించగలిగాం. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతున్నాను. డిజిటల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర సమాచార మరియు పౌరసంబంధాలశాఖ మంత్రిగా ఈ అవార్డులు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు మంత్రి కొలుసు పార్థసారథి..

 

 

 



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?

Off The Record: ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమైంది....

IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..

భారత్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి...

Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్‌ న్యూస్‌.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట

Bank Strike: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU).. బ్యాంకుల...

ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు

ECI SIR Meeting: కేంద్రం ఎన్నికల సంఘం కీలక సమావేశం శనివారం...