5
October, 2026

A News 365Times Venture

5
Monday
October, 2026

A News 365Times Venture

AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..

Date:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరులో ప్రతిష్టాత్మకమైన ‘జల్ జీవన్ మిషన్’ , ‘అమరజీవి జలధార’ కార్యక్రమాలకు ఇద్దరు నేతలు కలిసి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే మహోన్నత లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఈ బృహత్తర ప్రాజెక్ట్‌ను చేపట్టింది. సుమారు రూ. 30,156 కోట్ల భారీ అంచనా వ్యయంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ గృహాలకు తాగునీటి కష్టాలు పూర్తిగా తీరనున్నాయి. ఈ పథకం కింద ప్రభుత్వం ఏకంగా 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లను ఏర్పాటు చేయనుంది. దీనివల్ల గ్రామీణ మహిళలు తాగునీటి కోసం మైళ్ల దూరం నడిచే ఇబ్బందులు తొలగిపోయి, నేరుగా ఇంటివద్దే స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతుంది. ప్రజల ఆరోగ్యానికి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందనడానికి ఈ పథకమే నిదర్శనంగా నిలుస్తోంది.

రేపు ఉదయం 11:20 గంటలకు ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్‌కు సంబంధించిన ప్రత్యేక ప్లాయిల్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్లాయిల్‌ను ఆవిష్కరించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ఇద్దరు నేతలు పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రభుత్వ విధానాలను, రాబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ సభ వేదిక కానుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..

ఒప్పో సంస్థ తన కొత్త ‘ఒప్పో F35 సిరీస్’ స్మార్ట్‌ఫోన్లను భారత...

Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య అక్టోబర్ 6వ తేదీ నుంచి ప్రారంభంకానున్న...

KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో అజేయ శతకం సాధించినప్పటికీ, భారత వికెట్...

Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?

ఒకప్పుడు స్నీకర్లను కేవలం క్రీడలకు లేదా సాధారణ అవసరాల కోసం ధరించే...