10
October, 2026

A News 365Times Venture

10
Saturday
October, 2026

A News 365Times Venture

AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..

Date:

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై రేపు (అక్టోబర్ 10) ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ అత్యవసర సమావేశం ప్రారంభంకానుంది. గతంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు కల్పించిన 34 శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, తదుపరి కార్యాచరణపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికను కేబైట్ పరిశీలించనుంది. బీసీ సామాజిక వర్గాల ఆర్థిక, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, జీవన ప్రమాణాలపై కమిటీ ఇచ్చిన ఈ రిపోర్ట్ ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు.

సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేసే మార్గాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీ, జిల్లా, రాష్ట్ర స్థాయి యూనిట్లను ప్రాతిపదికగా తీసుకుని, జనాభా లెక్కలకు తగినట్లుగా రిజర్వేషన్లు రూపొందించే అంశంపై మంత్రివర్గంలో మథనం జరగనుంది.

అంతేకాకుండా.. గతంలో అమల్లో ఉన్న 33.33 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవోలను అధికారికంగా రద్దు చేసే లేదా ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో తుది నిర్ణయం వెలువడిన వెంటనే, ప్రభుత్వ పరంగా కొత్త జీవోలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వపరంగా రిజర్వేషన్లు ఖరారైన తర్వాత, కూటమి పార్టీలు రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయడం, తదితర కీలక అంశాలపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు

ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని, ఎన్నికల...

Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత

Saudi Arabia: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ గురువారం వరుస పేలుళ్లతో...

Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!

Elon Musk: ప్రపంచ కుబేరుడు భారత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు....

Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన

సౌదీపై హౌతీల దాడులు తీవ్రమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది....