28
June, 2026

A News 365Times Venture

28
Sunday
June, 2026

A News 365Times Venture

Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!

Date:

Anant Ambani Donates Rs 27.5 Crore to TTD: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆదివారం (జూన్ 28) ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో సమావేశమైన అనంత్ అంబానీ.. తిరుమల అభివృద్ధికి పలు కీలక విరాళాలను ప్రకటించారు.

టీటీడీకి సుమారు రూ.27.5 కోట్ల విలువ చేసే 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందజేస్తామని అనంత్ అంబానీ వెల్లడించారు. ఈ బస్సులు తిరుమలలో భక్తులకు పర్యావరణహిత రవాణా సేవలను మరింత మెరుగుపర్చడంలో ఉపయోగపడనున్నాయి. అంతేకాకుండా ఈ 25 ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమైన 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థ భరిస్తుందని ప్రకటించారు. అదేవిధంగా తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా రిలయన్స్ సంస్థ సహకరించేందుకు అంగీకరించింది. దీంతో తిరుమలలో గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడనుంది.

ఇక పశు సంరక్షణకు సంబంధించి కూడా అనంత్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్‌లో రిలయన్స్ నిర్వహిస్తున్న ‘వంతారా’ తరహాలో తిరుమల గోశాలను ఆధునీకరించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. ఆధునిక సదుపాయాలు, మెరుగైన సంరక్షణ, పశువైద్య సేవలతో గోశాలను అభివృద్ధి చేసే దిశగా టీటీడీతో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. అనంత్ అంబానీ ప్రకటించిన ఈ భారీ విరాళాలు, తిరుమలలో పర్యావరణహిత రవాణా వ్యవస్థతో పాటు గోశాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడనున్నాయని టీటీడీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన భక్తి భావంతో చేసిన ఈ సేవలు ప్రస్తుతం భక్తుల ప్రశంసలు అందుకుంటున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక

Iran: మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) మరోసారి యుద్ధ జ్వాలల్లోకి రగులుతోంది. తమ...

Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..

Aman Sanger: భారతీయ యువత సత్తా ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని ఏలుతోంది....

Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!

Venezuela: వెనిజులాలో సంభవించిన జంట భూకంపాల విధ్వంసంలో తన ప్రాణాలను పణంగా...

Hyderabad: షా గౌస్, మెహ్‌ఫిల్‌లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!

Hyderabad: భాగ్యనగరంలోని ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల ఉండే ప్రముఖ రెస్టారెంట్ల అసలు...