2
November, 2026

A News 365Times Venture

2
Monday
November, 2026

A News 365Times Venture

Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!

Date:

Amit Shah: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. 1984 నవంబర్ 1 సిక్కుల వ్యతిరేక అల్లర్లు జరిగిన రోజే కాంగ్రెస్ రామ్‌లీలా మైదాన్ ర్యాలీ చేపట్టడాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమం ద్వారా సిక్కుల మనోభావాలను ప్రతిపక్షాలు దెబ్బతీశాయని అన్నారు. అల్లర్ల బాధితుల గాయాలపై ఉప్పు చల్లినట్లు అభివర్ణించారు.చండీగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. 1984 నవంబర్ 1న జరిగిన హింసలో వేలాది మంది సిక్కులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఈ అల్లర్లను కాంగ్రెస్ ప్రేరేపించిందని ఆయన విమర్శించారు. వేలాది మందిని సజీవ దహనం చేశారని, అనేక కుటుంబాలు ఇళ్లను విడిచి వెళ్లాల్సి వచ్చిందని, పిల్లలు అనాథలుగా, మహిళలు వితంతువులుగా మారారని పేర్కొన్నారు.

అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని కూడా అమిత్ షా ప్రస్తావించారు. ‘‘పెద్ద చెట్లు కూలినప్పుడు భూమి కంపిస్తుంది’’అని రాజీవ్ గాంధీ సిక్కుల ఊచకోను తక్కువ చేసి మాట్లాడినట్లు అమిత్ షా వెల్లడించారు. 1984 అల్లర్ల బాధితుల పట్ల సున్నితత్వం లేకుండా కాంగ్రెస్ ర్యాలీ నిర్వహిస్తోందని అమిత్ షా ఆరోపించారు. నవంబర్ 1,2,3 తేదీల్లో కార్యక్రమాలు నిర్వహించవద్దని బీజేపీ కాంగ్రెస్‌ను కోరినట్లు ఆయన చెప్పారు.

విదేశాల నుంచి వచ్చే ఆదేశాల మేరకు నవంబర్ 1 ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించిందని అమిత్ షా ఆరోపించారు. దీపావళి వ్యాపారాలు దెబ్బతీస్తున్నారని ఢిల్లీ వ్యాపారులు జ్ఞప్తిని కూడా INDIA కూటమి పట్టించుకోలేదని అమిత్ షా విమర్శించారు. పండుగకు ముందు మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో ఢిల్లీలో సుమారు రూ.25,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల్లో రాహుల్ వరస పరాజయాలను ప్రస్తావిస్తూ.. ఆయనను ప్రధానిగా చూడాలని తల్లి సోనియా ఆకాంక్షిస్తున్నారని, ప్రతిపక్షాలు కొత్త రాజకీయ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయని, మాక్ పార్లమెంట్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని విమర్శించారు.‘‘రాహుల్ జీ.. మీరు ప్రధానమంత్రి కావాలనుకుంటే జీవితాంతం మాక్ పార్లమెంట్‌లోనే ఉండిపోండి. ఎందుకంటే మీ వంతు ఎప్పటికీ రాదు’’ అని షా సెటైర్లు వేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Ind Vs NZ: భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..

హామిల్టన్‌లోని సెడ్డన్ పార్క్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన...

Mallikarjun Kharge: జ్ఞానేష్ కుమార్ ఎక్కడ దాక్కున్నా వదలం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..

ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ‘ఓట్ బచావో.. దేశ్...

Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!

Rahul Gandhi: ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన ఇండియా కూటమి మెగా...

Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..

ఆంధ్రప్రదేశ్‌లో 92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం...