ఆలియా భట్ పేరుకు స్టార్ కిడ్ అయినప్పటికీ తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని సక్సెస్ అయ్యింది. డిఫరెంట్ మూవీస్ చేస్తూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక పెళ్లయ్యాక సెలక్టివ్ సబ్జెక్ట్స్ చేస్తోన్న ఆలియా లాస్ట్ ఫిల్మ్ జిగ్రా బాక్సాఫీస్ దగ్గర తేడా కొట్టింది. ఈ లెక్క సరిచేయడానికి నెక్ట్స్ హైఆక్టేన్ మూవీస్ సిద్దం చేస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్శ్‌లో తెరకెక్కుతోన్న ఆల్ఫా గత ఏడాదే రావాల్సి ఉంది.. కానీ వార్2 రిజల్ట్ చూసిన యశ్ రాజ్ ఫిల్మ్స్ .. ఈ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రజెంట్ ఈ సినిమా చివరి దశకు చేరుకుందని సమాచారం.
Also Read : Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్.. కావ్య పెళ్లి ఫోటోలు..
ఆల్ఫానే కాదు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న లవ్ అండ్ వార్ సెట్స్‌పై ఉంది. రణబీర్, విక్కీ కౌశల్, ఆలియా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ ఏడాది మార్చిలో రావాల్సిన ఈ మూవీలోని కీలక సన్నివేశాలు తెరకెక్కించాలట. జూన్ నాటికి షూట్ పూర్తి చేయనున్నారు. అత్యంత పకడ్బందీగా.. ఒక్క సీన్ కాదు కదా ఒక్క పీక్ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు భన్సాలీ. భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న కారణంగా చాలా టైం పడుతుందని తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది ఈ సినిమా రానట్లే అంటోంది బీటౌన్ మీడియా. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్స్‌కు బోలెడు టైం పట్టేస్తుండటంతో ఇవే జోనర్ బోర్ కొట్టిన ఆలియా.. నెక్ట్స్ సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌కు సిద్దం చేస్తోంది. దృశ్యం2 ఫేం అభిషేక్ పాఠక్‌తో హౌస్ వైఫ్ అనే మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్ కుమార్ రావ్‌ని హీరోగా కన్సిడర్ చేస్తున్నారని బీటౌన్‌లో వినిపిస్తున్న మాట. ఇక త్రిబుల్ ఆర్ తర్వాత టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చేసింది సీత. నాగ్ అశ్విన్‌తో ఓ మూవీ చేయబోతోందని రూమర్స్ రాగా, అవి గాసిప్స్ వరకే పరిమితమయ్యాయి. కానీ తాజాగా ఓ ఇంట్రస్టింగ్ బజ్ వినిపిస్తోంది. తారక్- ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్‌లో ఓ కీ రోల్ చేయబోతోందట ఆలియా. బాలీవుడ్ మార్కెట్ కొల్లగొట్టేందుకు ఆమెను తీసుకొస్తున్నట్లు సమాచారం. త్రిబుల్ ఆర్‌లో కాసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న తారక్ అండ్ ఆలియా .. ఇది కన్ఫర్మ్ అయితే ఎంత సేపు కనిపిస్తారో చూడాలి.




